ETV Bharat / business

క్యూ2 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్లకు కీలకం!

ఈ వారం స్టాక్​ మార్కెట్లకు(Stock market) త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు దిశా నిర్దేశం (Market Outlook) చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Stock market
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Oct 17, 2021, 3:26 PM IST

త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు(Market Outlook) ఈ వారం స్టాక్​ మార్కెట్లకు(Stock market) కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

"ఈ వారం మార్కెట్లకు త్రైమాసిక ఫలితాలు దిక్చూచిగా మారనున్నాయి. తొలి త్రైమాసికంతో పోలిస్తే.. క్యూ2లో కంపెనీలు భారీగా పుంజుకున్నాయి. ఆ అంచనాలతో మదుపరులు పెట్టుబడులకు మొగ్గు చూపవచ్చు. దాని ఫలితంగా మార్కెట్​ అంచనాలను అధిగమించే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రతికూలతలకూ అవకాశం లేకపోలేదు."

- యేశా షా, సామ్కో సెక్యూరిటీస్​ అధినేత.

ఈ వారంలో అల్ట్రాటెక్​ సిమెంట్​, ఏసీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​ లిమిటెడ్​, ఏషియన్​ పెయిట్స్​, హిందుస్థాన్​ జింక్​, ఐడీబీఐ, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, సౌత్​ఇండియన్​ బ్యాంక్​, ఫెడరల్​ బ్యాంక్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ వంటి ప్రముఖ సంస్థలు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్నాయి. కొద్ది కాలంగా అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వార్తలు కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. క్యూ2లో అదరగొట్టిన అవెన్యూ సూపర్​ మార్కెట్​​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఫలితాలపైనా దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు.

ఇదీ చూడండి: హెచ్​డీఎఫ్​సీ- డీమార్ట్​కు లాభాల పంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.