దాదాపు నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు (Petrol Price today) ఆదివారం స్వల్పంగా తగ్గింది. లీటర్ పెట్రోల్‌పై 20పైసలు తగ్గింది. మరోవైపు డీజిల్ ధర కూడా 20పైసలు తగ్గింది. వారం వ్యవధిలో.. డీజిల్ ధర తగ్గడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్((Petrol Price in Hyderabad) ధర రూ.105.69, డీజిల్ ధర రూ.97.15కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడం వల్ల దేశీయ విక్రయ సంస్థలు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో అక్టోబర్ కాంట్రాక్టుకు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లుగా పలుకుతోంది.
జులై 18 నుంచి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొత్తం 41 సార్లు పెట్రో ధరల్ని(Petrol rate) పెంచింది. దాదాపు ఒక నెల పాటు రోజు విడిచి రోజు ధరలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సంలో లీటర్ పెట్రోల్ ధర రూ.11.44, డీజిల్ ధర రూ.8.74 మేర పెరగడం గమనార్హం.
వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.(లీటర్ ధర రూ.లలో)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | 105.69 | 97.15 |
దిల్లీ | 101.64 | 89.07 |
కోల్‌కతా | 101.93 | 92.13 |
ముంబయి | 107.66 | 96.64 |
చెన్నై | 99.32 | 93.66 |
బెంగళూరు | 105.13 | 94.49 |
లఖ్‌నవూ | 98.70 | 89.45 |
ఇదీ చూడండి: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్