ETV Bharat / business

Paytm share price: 2 రోజుల్లోనే రూ. 50వేల కోట్ల సంపద ఆవిరి! - airtel share price today

పేటీఎం సంస్థ షేర్​ విలువ(Paytm share price) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రోజురోజుకు దిగజారుతోంది. ఈరోజు ట్రేడింగ్‌లో ఓ దశలో ఏకంగా 14 శాతం కుంగి మదుపర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో 2 రోజుల్లోనే రూ.50 వేల కోట్ల పేటీఎం సంపద ఆవిరయ్యింది.

Paytm share price
పేటీఎం షేర్​ విలువ
author img

By

Published : Nov 22, 2021, 3:20 PM IST

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ (Paytm share price today) షేరు మదుపర్లకు తీవ్ర నష్టాన్ని కట్టబెడుతున్నాయి. గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అడుగిడిన తొలి రోజే భారీగా కుప్పకూలిన ఈ స్టాక్‌ విలువ మరింత దిగజారుతోంది. ఈరోజు ట్రేడింగ్‌లో ఓ దశలో ఏకంగా 14 శాతం కుంగి మదుపర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇష్యూ ధర రూ.2,150 కంటే బీఎస్‌ఈలో దాదాపు 41 శాతం నష్టపోయి రూ.1,271 వద్ద కనిష్ఠాన్ని తాకింది. దీంతో ఇష్యూ ధర వద్ద కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.39 లక్షల కోట్లు కాగా.. దాంట్లో దాదాపు రూ.56 వేల కోట్ల సంపద ఆవిరైంది.

36 శాతం పెట్టుబడి ఆవిరి..

పేటీఎం (Paytm share price) పబ్లిక్‌ ఇష్యూలో ఒక లాట్‌కు 6 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.2,150 ప్రకారం ఒక లాట్‌కు పెట్టుబడి రూ.12,900 అయ్యింది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఉన్న రూ.1,366తో పోలిస్తే.. పెట్టుబడి విలువ రూ.8,196కి తగ్గింది. ఈ ప్రకారం చూస్తే.. మదుపరికి రూ.4,704 నష్టం వచ్చింది. అంటే 36 శాతం పెట్టుబడి ఆవిరైంది. ఐపీఓలో షేరు ధర అధికంగా నిర్ణయించడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్ డౌన్‌..

ఇక సౌదీ ఆరామ్‌కోతో 15 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చొన్న రిలయన్స్‌.. దాన్ని పునఃమదింపు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, దాదాపు ఈ డీల్‌ (reliance aramco deal) రద్దయినట్లేనని మార్కెట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో రిలయన్స్‌ షేరు విలువ ఈరోజు ట్రేడింగ్‌లో ఓ దశలో 4.5 శాతానికి పైగా కుంగి రూ.2,356 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

ఎగబాకిన ఎయిర్‌టెల్‌..

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచింది. దీంతో షేరు ధర (airtel share price today) ఈరోజు ట్రేడింగ్‌లో 4 శాతానికి పైగా పెరిగి రూ.756 వద్ద గరిష్ఠాన్ని తాకింది.

ఇదీ చదవండి:ఎయిర్​టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలివే

Stock market: మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్​ 1400 పాయింట్లు పతనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.