దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి(stock market news). బీఎస్ఈ సూచీ సెన్సెక్స్(bse sensex today live ) 433పాయింట్లు క్షీణించి 59,920 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ(nifty today live ) 144పాయింట్లు కోల్పోయి 17,874 వద్ద స్థిరపడింది.
బ్యాంకు, ఎఫ్ఎమ్సీజీ, ఆటో, ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా..
అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, అమెరికా వినియోగదారుల ధరల సూచీ 6.2 శాతం పెరగడం సహా ద్రవ్యోల్బణ భయాలతో మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ స్థితిలోనూ కోలుకోలేకపోయాయి.
ఉదయం 60,292 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. 60,293 గరిష్ఠాన్ని నమోదు చేసి వెంటనే పతనమైంది. 59,656 కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు కాస్త పుంజుకుని 433పాయింట్లు కోల్పోయి 59,920 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50.. ఉదయం 17,967 వద్ద ప్రారంభమై.. 19,971 గరిష్ఠాన్ని తాకింది. ఆ వెంటనే మరింత నష్టాల్లోకి జారుకుని 17,798 కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 144పాయింట్లు కోల్పోయి 17,874 వద్ద స్థిరపడింది.
లాభనష్టాలు...
- టైటాన్, రిలయన్స్, టాటాస్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభాలు గడించాయి.
- ఎస్బీఐ, టెక్ఎమ్, ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.
గతవారం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ సోమవారం లాభాలు ఆర్జించాయి. మళ్లీ వరుసగా మూడు రోజులు పతనం(stock market news) అయ్యాయి.
ఇదీ చూడండి:- అన్నంత పని చేసిన మస్క్- 9 లక్షల 'టెస్లా' షేర్లు విక్రయం..