ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నుండి నికర ప్రవాహం డిసెంబర్‌లో రూ. 13,121 కోట్లకు పెరిగింది. అంతకు ముందు నవంబర్ నెలలో ఈ ప్రవాహం రూ. 13,004 కోట్లగా ఉంది.
మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లలోకి పోవడానికి లేదా నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎంచుకున్నారు. కొంత మంది పెట్టుబడిదారులు తమ డబ్బును డెట్ ఫండ్లలో పెట్టుబడికి ఎంచుకున్నారు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సు గత 6 నెలల్లో నిరంతర ప్రవాహాన్ని చూశాయి. ఎందుకంటే కొంతమంది పెట్టుబడిదారులు తమ డబ్బును 'ఐపీఓ'లలో పెట్టాలని ఎంచుకున్నారు. మరియు నేరుగా స్టాక్స్‌లోకి పెట్టుబడులు వచ్చి చేరాయి.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారులు మార్కెట్ ర్యాలీని, లాభాలను బుక్ చేసుకునే అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. ఆదాయాలు పుంజుకుంటాయనే అంచనాలపై మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. 2020 మార్చిలో కుప్పకూలిన భారత మార్కెట్లు ఇపుడు 80% కంటే ఎక్కువ లాభపడ్డాయి. 2020 డిసెంబర్‌లో బెంచ్‌మార్కు సెన్సెక్సు సూచీ 8% పెరిగింది. మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిని తాకాయి.
దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు స్థిరంగా స్టాక్‌లను విక్రయిస్తున్నారు. 2020 నవంబర్‌లో రికార్డు స్థాయిలో రూ. 48,319 కోట్ల అమ్మకాలు జరిపారు. డిసెంబర్‌లో కూడా రూ. 37,293 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) ఖాతాల సంఖ్య 2020 నవంబర్‌లో 34.07 మిలియన్ల నుండి డిసెంబర్‌కి 34.71 మిలియన్లకు పెరిగింది. ఈ సిప్ ఫోలియోల పెరుగుదల మ్యూచువల్ ఫండ్సులో పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తుంది.
ఇదీ చూడండి:- మీ పత్రాలను భద్రంగా పెట్టుకోండిలా..