ETV Bharat / business

ఆద్యంతం ఒడుదొడుకులు- చివరకు భారీ లాభాలు - sensex news

ఆరంభం నుంచి ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్​ సాగించిన సూచీలు.. చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 400, నిఫ్టీ 120 పాయింట్లకుపైగా పెరిగాయి. లోహరంగం షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఫార్మా, బ్యాంకింగ్​ షేర్లూ రాణించాయి.

MARKETS CLOSE
మార్కెట్లకు చివరికి లాభాలే
author img

By

Published : Nov 26, 2020, 3:41 PM IST

స్టాక్​మార్కెట్​ సూచీలు ఇవాళ తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడింగ్​ సాగించాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా.. చివరకు మాత్రం భారీ లాభాల్లో ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 432 పాయింట్లు పెరిగింది. చివరకు 44 వేల 259 వద్ద సెషన్​ను ముగించింది. ఆరంభంలో ఈ సూచీ దాదాపు 250 పాయింట్ల మేర నష్టపోయి.. 43 వేల 582 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం.. పుంజుకొని పరుగులు పెట్టింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 12 వేల 987 వద్ద స్థిరపడింది.

మొత్తం 1726 షేర్లు పెరిగాయి. 986 షేర్లు క్షీణించాయి. 179 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

లాభనష్టాల్లోనివివే..

నేటి సెషన్​లో లోహరంగం షేర్లు అత్యధికంగా రాణించాయి. జేఎస్​డబ్ల్యూ స్టీల్ 6 శాతానికిపైగా పెరిగింది.

​టాటా స్టీల్​, గ్రేసిమ్​, హిందాల్కో, బజాజ్​ ఫినాన్స్​, యాక్సిస్​ బ్యాంక్​ లాభాల్లో ముగిశాయి.

ఐచర్​ మోటార్స్​, బీపీసీఎల్​, మారుతీ సుజుకీ, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ నష్టపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.