స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 938 పాయింట్లు తగ్గి 47,409 వద్దకు చేరింది. నిఫ్టీ 271 పాయింట్లు కోల్పోయి 13,967 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌సీఎల్‌టెక్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే షేర్లు లాభాలను గడించాయి.
టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎం&ఎం, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, షేర్లు భారీగా నష్టాపోయాయి.