స్థూల ఆర్థిక గణాంకాలు(macroeconomic data), ఆటో సేల్స్(auto sales india), అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం స్టాక్ మార్కెట్లకు(Stock markets) దిశా నిర్దేశం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి(Corona virus), పెరుగుతున్న కేసులు, టీకాల పంపిణీపైనా(Vaccination) మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
" దేశీయంగా త్రైమాసిక ఫలితాల కాలం ముగిసింది. గతంలో కంటే మంచి ఫలితాలే వెల్లడయ్యాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఆర్థిక రంగం సానుకూలంగానే ఉంది. అయితే.. గత 18 నెలలుగా వృద్ధి మందగమనాన్ని పరిశీలిస్తే.. కొంత ఆందోళన కలుగుతుంది. దీర్ఘకాలంపై ఆలోచిస్తే.. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, వ్యాక్సినేషన్ వేగంగా సాగటం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతాయి. "
- సిద్ధార్థ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.
వీటన్నింటితోపాటు రూపాయి కదలికలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి: Stock Market: సెన్సెక్స్ కొత్త రికార్డ్- తొలిసారి 56వేల పైన...