ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా వేపాడ మండలానికి సంబంధించి... నేడు ప్రారంభించిన కిసాన్ మిత్రా అడ్వైజరీ సర్వీసెస్లో మొదటి సందేశాన్ని నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల హైదరాబాద్ నుంచి పంపించారు. ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన నాబార్డు అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు అందించే ఉద్దేశంతో కిసాన్ మిత్రా అడ్వైజరీ సర్వీసెస్ ప్రారంభించినట్లు చింతల వివరించారు. పోస్టర్లు, సందేశాలు, వాయిస్ మెసేజ్ల ద్వారా రైతులకు సూచనలను అందించనున్నట్లు తెలిపారు.