దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ 85 పాయింట్లు పతనమైంది. చివరికి 51,849 పాయింట్ల మద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ ఒకే పాయింట్ మేర లాభపడింది. 15,576 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఐటీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,913 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,450 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,597 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,459 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభ నష్టాల్లోనివి ఇవే..
ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, పవర్‌గ్రిడ్, మారుతీ, బజాజ్ ఆటో, ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు లాభాలను గడించాయి.
ఐటీసీ, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి.