భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్‌మార్కెట్లు భారీనష్టాల దిశగా సాగుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 1082 పాయింట్లకు పైగా కోల్పోయి 48,976 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 14,566 వద్ద ట్రేడవుతోంది.
దేశీయంగా కొవిడ్ విజృంభణ భారీ స్థాయిలో కొనసాగుతోంది. దీంతో మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. దేశవ్యాప్తంగానూ ఆయా రాష్ట్రాల్లో తీవ్రతను బట్టి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు ఈవారం విడుదల కానున్న ఆర్‌బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.
బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, డా. రెడ్డీస్, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.