బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.237 పెరిగి.. రూ.47,994 వద్దకు చేరింది. ఆసియావ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
వెండి ధర సైతం రూ.153 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.71,421 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,874 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు 27.80 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇవీ చదవండి: బంగారంపై పెట్టుబడులా.. ట్రై చేయండిలా!