అంతర్జాతీయంగా ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. దిల్లీలో మేలిమి పసిడి 10 గ్రాముల ధర రూ.791 పెరిగి రూ.51,717కు చేరింది. గురువారం బంగారం 10 గ్రాముల ధర రూ.50,926 వద్ద ముగిసింది.
పసిడి దారిలోనే వెండి కూడా భారీగా పెరిగింది. దిల్లీలో కిలో వెండి ధర రూ.2,147 పెరిగి రూ.64,578కి చేరింది.
మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తారన్న అంచనాలతో ధరలు భారీగా పెరిగినట్లు వెల్లడించారు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 1,950 అమెరికా డాలర్లుగా ఉంది. వెండి ఔన్స్‌కు 25.44 డాలర్ల వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి: మార్కెట్లకు లాభాల పంట- సెన్సెక్స్ +553