దేశంలో పసిడి ధరలు మరోసారి తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర మంగళవారం స్వల్పంగా రూ.102 తగ్గి.. రూ.48,025కి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణతతో బంగారం ధరలు దిగివస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
వెండి ధర రూ.269 (కిలోకు) కోల్పోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,810 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1882 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 27.67 డాలర్ల వద్ద ఉంది.
ఇవీ చదవండి: ఒడుదొడుకుల ట్రేడింగ్- ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు