బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.287 పెరిగి.. రూ.52,391కి చేరింది.
వెండి ధర కూడా కిలోకు రూ.875 పైకెగిసి రూ.69,950 కు పెరిగింది.
ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం వల్ల దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ నిపుణులు శ్రీరామ్ అయ్యర్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గి ఔన్సుకు 1,944 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు 26.95 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: రిలయన్స్ దూకుడు- సెన్సెక్స్ 646 పాయింట్లు ప్లస్