ETV Bharat / business

Stock Market: ఈ వారం మార్కెట్ల తీరు ఎలా ఉంటుందంటే? - స్టాక్ మార్కెట్

ఈ వారం స్టాక్ మార్కెట్లకు (Market outlook for this week) అంతర్జాతీయ పరిణామాలే కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణం ఆందోళనలు సహా అమెరికా బాండ్లపై రాబడి మార్కెట్లను ప్రభావితం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు భారత్ నుంచి పెట్టుబడులు తరలిస్తే.. సూచీలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

MARKET OUTLOOK
MARKET OUTLOOK
author img

By

Published : Nov 14, 2021, 11:56 AM IST

స్టాక్ మార్కెట్లకు ఈ వారం (Market outlook for this week) అంతర్జాతీయ పరిణామాలే దిశానిర్దేశం చేయనున్నాయి. విదేశీ పోర్ట్​ఫోలియో పెట్టుబడులపై ద్రవ్యోల్బణ ప్రభావం గురించి మదుపరులు అంచనాకు రానున్న నేపథ్యంలో.. సూచీలు కుదుపునకు (Market outlook for next week) గురయ్యే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు దాదాపుగా వచ్చేసినందున.. ఇకపై దృష్టంతా (Market outlook today) అంతర్జాతీయ పరిణామాలపైనే ఉంటుందని పేర్కొన్నాయి.

2021 అక్టోబర్​లో ద్రవ్యోల్బణం (US inflation rate) 6.2 శాతంగా నమోదైందని అమెరికా గతవారం విడుదల చేసిన గణాంకాల్లో తేలింది. ఇది 30 ఏళ్ల గరిష్ఠ స్థాయి. అదేసమయంలో చైనాలో సీపీఐ 1.5 శాతం పెరిగింది. ఉత్పత్తిదారుల ధర సూచీ 13.5 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఆందోళనలతో (US inflation and impact on India) పాటు అమెరికా బాండ్ల రాబడి రేటు పెరిగే అంశంపై ఈ వారం మార్కెట్లు ఆధారపడి ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బాండ్ రాబడి పెరిగితే(US bond yield).. విదేశీ మదుపరులు భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉందని తెలిపారు.

"క్యూ2 ఫలితాలు సీజన్ వల్ల ఇప్పటివరకు.. షేర్లు భిన్నంగా కదిలాయి. ఇకపై దృష్టంతా అంతర్జాతీయ సంకేతాలపై ఉంటుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు భారత్ నుంచి పెట్టుబడులు తరలిస్తే.. మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, దేశీయ మదుపర్లు కొనుగోళ్లు జరిపితే సూచీలకు మద్దతు లభించే అవకాశం ఉంది."

-మార్కెట్ నిపుణులు

టోకు ధరల ద్రవ్యోల్బణం డేటా మంగళవారం విడుదల కానుంది. దీనిపైనా మదుపర్లు దృష్టిసారించే అవకాశం ఉంది. శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉంటుంది.

గతవారం ఓకే..

దేశీయ సూచీలు గతవారం చివరి నాలుగు రోజుల్లో మూడు రోజులు వరుసగా నష్టాల్లోనే సాగాయి. శుక్రవారం కాస్త కోలుకున్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే వారం వ్యవధిలో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ (BSE Sensex) 619 పాయింట్లు లాభపడింది.

ఇదీ చదవండి: Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.