లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 38,757 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 24 పాయింట్లు పడిపోయి 11,440కి చేరుకుంది.
ఐటీ షేర్లు భారీ లాభాల్లో ట్రేడయినా.. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టపోయాయి. ఒకానొక దశలో 375 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 39,230 గరిష్ఠాన్ని తాకింది.
లాభనష్టాల్లో..
హెచ్‌సీఎల్ టెక్ 10 శాతంపైగా లాభపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఆటో షేర్లు రాణించాయి.
భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ నష్టపోయాయి.
రూపాయి..
సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి డాలరుతో పోలిస్తే 73.48 వద్ద స్థిరపడింది.
ఆసియా మార్కెట్లు..
ఆసియాలోని ప్రధాన మార్కెట్లైన హాంకాంగ్, షాంఘై, జపాన్, దక్షిణ కొరియా సూచీలు లాభపడ్డాయి.
ఇదీ చూడండి: అమెజాన్‌లో లక్ష ఉద్యోగాల నియామకం