ETV Bharat / business

'స్టాక్​ మార్కెట్ల పతనం తాత్కాలికమే.. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయంటే..' - stock market latest updates

Stock market: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1545 పాయింట్లు, నిప్టీ 468 పాయింట్లు కోల్పోయాయి. అయితే ఈ ప్రభావం తాత్కాలికమేనని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక సూచీలు మళ్లీ పుంజుకుంటాయని చెబుతున్నారు.

stock market
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jan 24, 2022, 4:19 PM IST

Stock market: అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో ఈ వారం స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తలు వంటి అంశాలు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపటం వల్ల సూచీలు భారీగా పతనమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్, మెటల్, ఐటీ, పవర్, ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ దాదాపు అన్ని సెక్టార్లు నష్టాలను చవిచూశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1545 పాయింట్లు, నిప్టీ 468 పాయింట్లు పతనమయ్యాయి. ఒకే రోజు భారీ కరెక్షన్లతో రెండు సూచీలు నష్టాల బాట పట్టి, లక్షల కోట్ల సంపద ఆవిరవగా.. ఇన్వెస్టర్లు లబోదిబో అంటున్నారు.

సోమవారం ఉదయం 59 వేల 39 పాయింట్లతో బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. మార్కెట్ ఆరంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగగా సెన్సెక్స్ పతనం మొదలైంది. పేటీఎం, జొమాటో, నైకా షేర్లు 52 వారాల కనిష్ఠానికి పతనమయ్యాయి. ఐపీఓకు ఇటీవల యాడ్ అయిన కంపెనీలు 40 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా టెక్నాలజీ గూడ్స్ సైతం భారీ కరెక్షన్లకు గురయ్యాయి. భారత టెక్నాలజీలు సైతం అదే బాట పట్టాయి. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు, వడ్డీ రేట్ల పెరుగుదల మదుపరుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితుల వల్ల మదుపర్లు అమ్మకాలకు దిగటం సూచీలు వేగంగా పడిపోవటానికి కారణమని నిపుణులు సూచిస్తున్నారు.

ఆసియా మార్కెట్ల పతనం నేరుగా భారత మార్కెట్​పై పడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు సైతం ఐదు శాతం పడిపోయాయి. అంతర్జాతీయంగా లిక్విడిటీ పెరగటం, వడ్డీ రేట్ల పెరుగుదల భయాలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఈ కరెక్షన్ తాత్కాలికమే అని.. మార్చి- ఏప్రిల్ వరకు ఈ పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని చెబుతున్నారు.

'స్టాక్​ మార్కెట్ల పతనం తత్కాలికమే.. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయంటే'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: అద్దె విమానాలపై కొవిడ్​ దెబ్బ.. ఎన్నికలున్నా గిరాకీ అంతంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.