ETV Bharat / business

టీకా వార్తలే ఈ వారం మార్కెట్​కు కీలకం! - తాజా మార్కెట్​ వార్తలు

ఓ వైపు కరోనా కేసుల్లో పెరుగుదల, మరోవైపు వ్యాక్సిన్​పై అంచనాలే ఈ వారం దేశీయ మర్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

COVID-19 vaccine
వ్యాక్సిన్​ ప్రకటనలే ఈ వారం మార్కెట్​కు కీలకం!
author img

By

Published : Nov 22, 2020, 2:20 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కేసుల్లో పెరుగుదల మదుపరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్​లపై పెరుగుతోన్న అంచనాలు ఒకింత ఊరట కలిగించవచ్చు అంటున్నారు. వీటితో పాటు అమెరికా వ్యాక్సిన్​ల పురోగతి సహా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లకు కీలకం కానున్నాయి.

"ఈ వారం మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతాయి. కేసుల పెరుగుదలపై ఒకింత ఆందోళన, వ్యాక్సిన్​ల పురోగతిపై ఆనందం మధ్య సూచీలు ఊగిసలాడే అవకాశం ఉంది. అమెరికా ప్రకటనలను మదుపరులు నిశితంగా పరిశీలిస్తారు."

- సిద్ధార్థ కేమ్కా, మోతిలాల్​ ఓస్వాల్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​లో​ రీసెర్చ్​ రిటైల్ హెడ్

భారత కంపెనీల త్రైమాసిక ఫలితాలు, వ్యాక్సిన్​పై కీలక ప్రకటనలు కూడా మార్కెట్​పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

కిందటి వారాంతంలో విదేశీ వ్యవస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్​లో కీలకంగా వ్యవహరించారు. 3,860 కోట్ల విలువగల షేర్లను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ సానుకూలతలతోనే గత వారం మార్కెట్లు నడిచాయి. ఈ వారం కూడా వ్యాక్సిన్​పై కీలక ప్రకటన ఏమైనా వస్తే ఎఫ్​ఐఐలు కీలకం కానున్నారని నిపుణులు అంటున్నారు.

వ్యాక్సిన్​ పంపిణీ సమర్థత, ఆర్థిక పునరుత్తేజం వంటివి అంతర్జాతీయ మార్కెట్​పై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.