ETV Bharat / business

ఎస్​ బ్యాంకు గండంతో సెన్సెక్స్​ 894 పాయింట్లు పతనం​ - సెన్సెక్స్ వార్తలు

స్టాక్​ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్​ 894, నిఫ్టీ 279 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్​ఈలో మదుపరుల సంపద రూ.3.85 లక్షల కోట్లు ఆవిరైంది.

stock
సెన్సెక్స్​
author img

By

Published : Mar 6, 2020, 3:48 PM IST

వరుసగా రెండో వారాంతపు సెషన్​లో భారీ నష్టాలను నమోదు చేశాయి స్టాక్​ మార్కెట్లు. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 894 పాయింట్లు కోల్పోయి 37,577 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 10,989 పాయింట్లకు చేరుకుంది.

3.85 లక్షల కోట్లు ఆవిరి..

ప్రారంభ సెషన్​లో అమ్మకాల ఒత్తిడి కారణంగా 1,400 పాయింట్ల మేర​ కోల్పోయింది సెన్సెక్స్​. ఫలితంగా మదుపరులు రూ. 3,85,485 కోట్ల సంపదను కోల్పోయారు.

కరోనా భయాలు, ఎస్​ బ్యాంక్​పై మారటోరియం విధింపు వల్ల స్టాక్​ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోవటమూ దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. బ్యాంకింగ్ రంగ షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి. వాహన, లోహ రంగాలు స్వల్పంగా రాణించాయి.

బ్యాంక్​ షేర్లపై పరిమితులు విధించిన ఎన్​ఎస్​ఈ

ఎస్​ బ్యాంక్ షేర్లపై జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి పలు సెగ్మెంట్లలో పరిమితులు విధించింది. ఎస్​ బ్యాంక్​పై ఆర్బీఐ మారటోరియం విధించిన నేపథ్యంలో దాని షేర్లు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది ఎన్​ఎస్​ఈ.

నష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్​, ఎస్బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, రిలయన్స్​ నష్టాల్లో ఉన్నాయి. మారుతి, బజాజ్​ ఆటో లాభాల్లో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.