పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా జింబాబ్వేలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాలంటే సగటు ఉద్యోగి నెల జీతం ఇవ్వాల్సిందే. ఆ స్థాయిలో అక్కడి ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచేసింది.
డీజిల్‌పై 16.64 జింబాబ్వే డాలర్లు, ప్రస్తుత పెట్రోల్‌పై 25 శాతం అంటే 14.97 జింబాబ్వే డాలర్ల మేర ధర పెంచుతున్నట్లు ఆ దేశ ఇంధన నియంత్రణ ప్రాధికార సంస్థ(జీఈఆర్ఏ) ప్రకటించింది.
ఈ ధరల ప్రకారం ఇక పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించాల్సి వస్తే సగటు ఉద్యోగి ఒక నెల జీతం ఖర్చయినట్లే. వైద్యుడికైతే నెల జీతంలో సగం పోయినట్లే.
ఆర్థిక మాంద్యంతో ఇప్పటికే పెను భారం మోస్తోన్న దేశంపై పెట్రోల్ ధరల మోత మోగించడం సరికాదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే పెట్రోల్ ధరలను మూడు రెట్లు పెంచింది జింబాబ్వే ప్రభుత్వం.
- ఇదీ చూడండి: ఇంట్లోని రహస్య గదిలో గంజాయి సాగు