హోల్ సేల్ ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) ఫిబ్రవరిలో భారీగా పెరిగింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.17 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 2.03 శాతంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.26 శాతంగా ఉండటం గమనార్హం.
ఆహార పదార్థాల ధరలు గత నెల (జనవరితో పోలిస్తే) -2.80 శాతం నుంచి.. 1.36 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో కూరగాయల ధరలు ఏకంగా -20.82 శాతం నుంచి.. 2.90 శాతానికి పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
పప్పుధాన్యాల టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 10.25 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 9.48 శాతంగా ఉంది. ఇంధన, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం గత నెల 0.58 శాతంగా నమోదైంది.
ఇదీ చదవండి:పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం- ఐఐపీ నేల చూపులు