టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జూన్‌లో భారీగా తగ్గింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌లో డబ్ల్యూపీఐ 1.81 శాతం క్షీణించింది.
ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగినా.. ఇంధన, విద్యుత్ ధరలు తగ్గడం వల్ల ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చినట్లు తెలుస్తోంది.
అధికారిక లెక్కల ప్రకారం 2020 మేలో టోకు ద్రవ్యోల్బణం 3.21 శాతంగా, గత ఏడాది జూన్‌లో 2.02 శాతంగా ఉంది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మేతో పోలిస్తే జూన్‌లో 1.13 శాతం నుంచి 2.04 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 19.83 శాతం నుంచి 13.60 శాతానికి తగ్గింది.
తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం కూడా జూన్‌లో 0.08 శాతానికి పడిపోయింది. అంతకుముందు మేలో ఇది 0.42 శాతంగా ఉంది.
ఇదీ చూడండి:పసిడి పరుగు భవిష్యత్‌లోనూ కొనసాగేనా?