టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జులైలో స్వల్పంగా తగ్గింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలైలో డబ్ల్యూపీఐ 0.58 శాతం క్షీణించింది. ఆహార పదార్థాల ధరలు పెరిగినా.. ఇంధన, విద్యుత్తు ధరలు తగ్గడం వల్ల ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చినట్లు తెలుస్తోంది.
అధికారిక లెక్కల ప్రకారం 2020 జూన్లో టోకు ద్రవ్యోల్బణం 1.81 శాతంగా, గతేడాది జులైలో 1.17 శాతంగా ఉంది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్ (2.04 శాతం)తో పోలిస్తే.. జులైలో 4.08 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 13.60 శాతం నుంచి 9.84 శాతానికి తగ్గింది.
తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం జులైలో 0.51 శాతానికి పెరిగింది. అంతకుముందు జూన్లో ఇది 0.08 శాతంగా ఉంది.
రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 6.93 శాతానికి పెరిగింది. అంతకుముందు జూన్లో అది 6.23 శాతంగా ఉంది.
ఇదీ చూడండి: కరోనాకు చెక్ పెట్టే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ రూ.33కే!