టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) అక్టోబర్‌లో భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 0 శాతం నుంచి 1.48 శాతానికి పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఇది దాదాపు 8 నెలల గరిష్ఠానికి సమానం.
టోకు ద్రవ్యోల్బణం ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1.32 శాతంగా నమోదైంది.
ఆహార టోకు ద్రవ్యోల్బణం మాత్రం అక్టోబర్‌లో 6.37 శాతానికి తగ్గింది. ఇది సెప్టెంబర్‌లో 8.17 శాతంగా ఉంది.
తయారీ రంగ టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌తో పోలిస్తే..1.61 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది.
కూరగాయలు, బంగాళదుంపల టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 25.23 శాతం, 107.70 శాతంగా ఉన్నాయి.
ఆహారేతర ఫుడ్ ఆర్టికల్స్, మిరల్స్ల టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 2.85 శాతం, 9.11 శాతంగా నమోదయ్యాయి.
ఇంధన, విద్యుత్ ధరల టోకు ద్రవ్యోల్బణం మాత్రం గత నెల -10.95 శాతంగా నమోదవడం గమనార్హం.