ETV Bharat / business

బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించాలా వద్దా?

కరోనాతో చాలా మందికి ఆదాయం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించడం భారంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్​బీఐ ఇప్పటికే రుణాలపై 3 నెలల మారటోరియం విధించింది. మరో మూడు నెలలు పొడిగించే వీలుందని అంచనాలు ఉన్నాయి. మారటోరియం తాత్కాలికంగా ఉపశమనం కలిగినా.. తర్వాత వడ్డీల భారం తప్పదు. మరి ఇలాంటి సమయాల్లో మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకోవాలా? వద్దా? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. వాటన్నింటికీ సమధానాలు మీకోసం.

EMI moratorium is useful or not
ఈఎంఐలు చెల్లించాల వద్ద
author img

By

Published : May 7, 2020, 10:50 AM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌ అయ్యింది. చాలామంది వ్యక్తిగత ఆదాయాలు తగ్గిపోయాయి. ఇంతకుముందే తీసుకున్న రుణాలకు సంబంధించి, నెలవారీ కిస్తీల చెల్లింపు విషయంలో రుణగ్రహీతలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వీరికి ఊరట కల్పిస్తూ.. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మార్చి 27న పలు రకాల రుణ కిస్తీల వసూలును మూడు నెలలపాటు వాయిదా (మారటోరియం) వేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించిన పరిస్థితుల్లో.. ఈ మారటోరియం వ్యవధిని ఆర్‌బీఐ మరోసారి (ఇంకో 3 నెలలు) పెంచుతుందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చిన రుణాలకు మారటోరియం వ్యవధిని పెంచుతున్నట్లు ప్రకటించినందున.. రిటైల్‌ రుణాలకూ ఇది వర్తిస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ కూడా ఈ విషయాన్ని పరిశీలించాలని చెబుతోంది.. ఆర్‌బీఐ ఇప్పటికీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.. ఒకవేళ మరోసారి ఈ మారటోరియాన్ని పెంచితే.. దాని ప్రభావం ఎలా ఉంటుందన్నదే ఇప్పడు చాలామంది రుణ గ్రహీతల్లో ఉన్న సందేహం.

ఆదాయం లేకుంటే ఊరటే

జీతాల్లో కోత, ఆదాయాలు ఆగిపోవడం తదితర కారణాలను పరిగణనలోనికి తీసుకుంటే.. రుణ కిస్తీలను వాయిదా వేయడం రుణగ్రహీతలకు పెద్ద ఊరటగానే చెప్పాలి. కానీ, అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే.. ఈ మారటోరియాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు ఆర్థిక ఒత్తిడిని కాస్త తగ్గించుకోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇది భారంగానే పరిణమిస్తుంది. ఆర్‌బీఐ మారటోరియం ప్రకటించగానే.. చాలామంది వాయిదాలను రద్దు చేసిందని అపోహపడినా.. తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. మూడు నెలల వాయిదాలకు సంబంధించిన వడ్డీని, అప్పటి వరకూ ఉన్న అసలురుణంలో కలిపేస్తాయి బ్యాంకులు. దీనివల్ల అసలు మొత్తం పెరగడం సహా చెల్లింపు వ్యవధి పెరుగుతుంది.

ఏఏ రుణాలకు...

అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణ సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీ), ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన టర్మ్‌, వ్యవసాయ రుణాలకు ఈ మారటోరియం వర్తిస్తుంది. క్రెడిట్‌ కార్డు బిల్లులు, కార్డు రుణాల ఈఎంఐలకూ దీన్ని వాడుకోవచ్చు. ఒక బ్యాంకులో గృహరుణం, మరో బ్యాంకులో వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డు ఉన్నా.. వాటన్నింటికీ ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు.

మరో మూడు నెలలు పొడిగిస్తే..

ముందే అనుకున్నట్లు.. కిస్తీ చెల్లింపును వాయిదా వేస్తే.. బ్యాంకులు వడ్డీని అసులులో కలిపేస్తాయి. కాబట్టి, అవి కొత్త రుణాలు ఇచ్చినట్లే అవుతుంది. అంటే, ఒకరకంగా బ్యాంకులకు ఇది మేలు చేసే అంశమే. కానీ, రుణగ్రహీతల కోణంలో చూసినప్పుడు మాత్రం ఈ తాత్కాలిక ప్రయోజనం.. దీర్ఘకాలంలో భారంగా మారుతుంది. ఇప్పటికే మూడు నెలల మారటోరియం వాడుకున్న వారికి, అదనంగా రుణ మొత్తాన్ని బట్టి, 12-13 నెలల ఈఎంఐ భారం పెరుగుతుంది. మరో 3 నెలలు కూడా ఆర్‌బీఐ మారటోరియం విధిస్తే, ఆరు నెలల పాటు నెలవారీ కిస్తీ చెల్లించే అవసరం ప్రస్తుతానికి ఉండదు. కానీ రుణ చెల్లింపు వ్యవధి దాదాపు 24 నెలల వరకు పెరుగుతుందని బ్యాంకింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తప్పనిసరి అయితేనే..

వాస్తవంగా ఆదాయం తగ్గి, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి ఉంటేనే ఈ మారటోరియాన్ని వాడుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు 3 నెలల మారటోరియానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగిసిందని వెబ్‌సైట్లలో పేర్కొంటుండగా, మరికొన్ని.. ఇంకా అనుమతిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉండి, వాయిదాలు చెల్లించే స్థితిలో ఉన్నవారు.. ఎప్పటిలాగా ఈఎంఐలను చెల్లించడమే మేలు. దీనివల్ల ఎలాంటి అదనపు భారం సమస్యా రాదు. క్రెడిట్‌ కార్డు బిల్లులనూ చెల్లించడమే మేలు.

ఈఎంఐ లేదా వ్యవధి

బ్యాంకులు ప్రస్తుతం అమలు చేస్తున్న మారటోరియాన్ని ఎంచుకున్నప్పుడు.. వాయిదా మొత్తం పెరగాలా? వ్యవధి పెంచాలా అనేది రుణ గ్రహీత నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలను బట్టి మారుతుంది. గృహ రుణం విషయంలో మారటోరియం కోరేప్పుడు ఈ విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.

ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌లోకి మారండి

ప్రస్తుతం బ్యాంకులన్నీ రెపో ఆధారిత వడ్డీ రేటును (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) ప్రామాణికంగా తీసుకుని, కొంత శాతాన్ని అధికంగా వసూలు చేస్తున్నాయి. కాబట్టి, బ్యాంకులు, గృహరుణ సంస్థల దగ్గర తీసుకున్న గృహరుణాలకు సంబంధించి మీరు ఇప్పటికీ పాత విధానం ఎంసీఎల్‌ఆర్‌లో కొనసాగుతూ ఉంటే.. దాన్ని మార్చుకోండి. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌లోకి మారేందుకు బ్యాంకులు కొంత రుసుమును విధిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు అసలుపై 0.5శాతం వరకూ విధిస్తున్నాయి. ఎస్‌బీఐలాంటివి దీనికోసం రూ.5,000 వసూలు చేస్తోంది. కొన్ని బ్యాంకులు గరిష్ఠంగా రూ.10,000 వరకూ తీసుకుంటున్నాయి. వడ్డీ రేటును మార్చుకునేందుకు మీ బ్యాంకును సంప్రదించండి.

తర్వాత చెల్లించినా..

కొంతమంది ఇప్పుడు మారటోరియాన్ని వాడుకుని, తర్వాత పాక్షికంగా అసలు చెల్లిస్తే పెద్ద భారమేమీ ఉండదు కదా అని ఆలోచిస్తున్నారు. దీనివల్ల పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం.. మారటోరియం వడ్డీ, అసలులో కలుస్తుంది. కాబట్టి, మీరు తర్వాత చెల్లించేది.. కొత్తగా కలిసిన ఈ వడ్డీకి సరిపోతుంది. అంటే, మారటోరియం కన్నా ముందున్న అసలు ఏమాత్రం తగ్గదు.ఎప్పటికప్పుడు వాయిదాలను చెల్లించడమే మేలని వారి సూచన.

భారమెలా...

మీరు రెండేళ్ల క్రితం రూ.30లక్షల గృహరుణం తీసుకున్నారనుకుందాం. వడ్డీ 8.5శాతం, వ్యవధి 20 ఏళ్లు (240 నెలలు) ఉంది. ఇప్పటికే రెండేళ్ల పాటు వాయిదాలు చెల్లించారు. ఇప్పుడు ఈఎంఐ లేదా వ్యవధి పెరిగినప్పుడు పడే భారం.. వడ్డీ తగ్గితే వచ్చే ప్రయోజనాలను పట్టికలో చూద్దాం. (ఈఎంఐ రూ.26,035, 24 నెలలు చెల్లించిన తర్వాత మిగిలిన అసలు రూ.28,75,310).

వినియోగించుకుంది తక్కువే..

ఆర్‌బీఐ రుణ కిస్తీలను 3 నెలలు వాయిదా వేసుకునే వెసులుబాటు ఇచ్చినప్పటికీ.. దీన్ని పెద్దగా వినియోగించుకునేందుకు ముందుకు రాలేదనే చెప్పాలి. గృహరుణ ఖాతాదారుల్లో 10 శాతమే ఈ వెసులుబాటు వినియోగించుకున్నారని ఎస్‌బీఐ పేర్కొంది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ నుంచి రుణం తీసుకున్న వారు 15 శాతం వరకే మారటోరియం వాడుకున్నారు.

ఎన్‌బీఎఫ్‌సీలకూ మారటోరియం?: ఎస్‌బీఐ

అన్ని రకాల రుణాలకు మారటోరియం వర్తింపచేయాలని ఆర్‌బీఐ చెప్పినా..ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు ఈ వెసులుబాటును కల్పించలేదు. కానీ, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఈ విషయంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. దీన్ని పరిగణనలోనికి తీసుకున్న ఎస్‌బీఐ ఈ విషయంపై ఆలోచిస్తోంది.

ఇదీ చూడండి:డిజిటల్​ సంతకం ఈ-మెయిల్​లో పంపండి : ఈపీఎఫ్​ఓ​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.