ETV Bharat / business

డిజిటల్​ సంతకం ఈ-మెయిల్​లో పంపండి : ఈపీఎఫ్​ఓ​​

author img

By

Published : May 6, 2020, 8:36 PM IST

Updated : May 6, 2020, 10:10 PM IST

రిటైర్మెంట్ ఫండ్ బాడీ ​​యజమానులు తమ డిజిటల్​ సంతకాన్ని ఈ-మెయిల్​ ద్వారా రిజిష్టర్​ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్​ఓ కార్యాలయం వద్ద రిజిష్ట్​ర్​ చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

EPFO allows employers to register digital signatures via e-mail
ఈ మెయిల్​ ద్వారా సంతకం రిజిస్టేషన్​​

కరోనా వేళ రిటైర్మెంట్ ఫండ్ బాడీ సంస్థల యజమానులు తమ డిజిటల్ సంతకాన్ని ఈ-మెయిల్‌ను ఉపయోగించుకొని ఆన్‌లైన్ ద్వారా రిజిష్టర్ చేసుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ- ఈపీఎఫ్​ఓ అనుమతించింది. ఇప్పటివరకూ డిజిటల్ సంతకాన్ని సంబంధిత సంస్థల ప్రతినిధులు నేరుగా ఈపీఎఫ్​ఓ కార్యాలయాలకు వెళ్లి రిజిష్టర్ చేసుకొని వస్తుండగా.. ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా పంపే వీలు కల్పించినట్లు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం నెలకొన్న అ‌డ్డంకుల కారణంగా ఆయా సంస్థల యజమానులు తమ డిజిటల్ సంతకాలను ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో నమోదు చేయించేందుకు సమస్యలు వస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మికశాఖ తెలిపింది. ఈపీఎఫ్​ఓ ప్రాంతీయ కార్యాలయాల అధికారిక ఈ-మెయిల్‌ చిరునామా www.epfindia.gov.inలో ఉంటాయని కార్మికశాఖ తెలిపింది.

Last Updated : May 6, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.