ETV Bharat / business

క్రూడ్ ధరలు పతనమైనా.. పెట్రో బాదుడు ఎందుకు? - పెట్రోల్ ధరల పెంపునకు కారణాలు

పెట్రోల్, డీజిల్ ధరలు గత 11 రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయినప్పటికీ.. ఆ ప్రయోజనాలు వినియోగదారులకు అందడం లేదు. ఇందుకు కారణాలేమిటి? ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపునకు చెబుతున్న కారణాల్లో నిజమెంత?

reasons behind petrol price hiking
పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణాలు
author img

By

Published : Jun 17, 2020, 3:28 PM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఇటీవల రికార్డు స్థాయిలో క్షిణించాయి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పతనం ఇదివరకు ఎన్నడూ చూడలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుతాయని చాలా మంది అశించారు. అయితే ధరలు తగ్గకపోగా.. గత 11 రోజుల నుంచి మరింత పెరుగుతూ వస్తున్నాయి. జూన్ 7న మొదలైన బాదుడుతో.. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ.6 పెరిగింది.

no benefit to consumer
వినియోగదారుడికి దక్కని ప్రయోజనం

పెట్రోల్​పై లాభార్జన ఇలా..

పెట్రోల్​ ధరల పెరుగుదలకు అసలు కారణాలు ఏంటి? పెట్రో బాదుడుతో ప్రభుత్వం ఎలా లాభాలు ఆర్జిస్తుంది?... తెలుసుకుందాం!

కేస్-​1: అధిక ధరలు, బలహీన రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు, రూపాయి విలువకు అనుగుణంగా ధరలు సవరించామని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. కానీ అందులో నిజమెంత?

ఈ ప్రశ్నకు జవాబు కోసం వేర్వేరు సమయాల్లో, వేర్వేరు మారకం రేట్ల వద్ద దిల్లీలో పెట్రోల్ ధరలను ఉదాహరణగా తీసుకుందాం.

2013లో బ్యారెల్ ముడిచమరు ధర 111.59 డాలర్లు. డాలర్​తో రూపాయి మారకం విలువ రూ.66.89. దిగుమతి చేసుకోవాలంటే లీటర్ పెట్రోల్ రూ.46.94కు లభించేది. ఆ సమయంలో రిటైల్ మార్కెట్​లో లీటర్​ పెట్రోల్​ ధర రూ.76.06గా ఉండేది.

2018లో మారకం రేటు రూ.68. లీటర్​ పెట్రోల్​ ఈ సమయంలో రూ. రూ.33.90కే లభించేది. అప్పుడు కూడా రిటైల్ మార్కెట్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.76గానే ఉంది.

ఇటీవలి ధరల ఆధారంగా చూస్తే..

ఈ ఏడాది ఏప్రిల్​లో ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. రూపాయి మారకం విలువ అత్యధికంగా రూ.75.27 వద్ద ఉన్నప్పటికీ.. బ్యారెల్ ముడి చమురు ధర 19.90 డాలర్లుగానే ఉంది. ఈ లెక్కన లీటర్​ పెట్రోల్ రూ.9.42లకే లభించింది. అయినప్పటికీ రిటైల్​ మార్కెట్లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ.70పైనే ఉంది. దీని ఆధారంగా చూస్తే పెట్రోల్ ధరలపై మారకం విలువ ప్రభావం లేదనే విషయం తేటతెల్లమవుతోంది.

పెట్రోల్ ధరలు ఇలా..

petrol prices in 2013, 2018, 2020
2013, 2018, 2020లలో పెట్రోల్ ధరలు ఇలా..

కేస్-​2: రాయితీల భారం..

రాయితీల భారం పెరుగుతుందని, అందుకే పెట్రో ఉత్పత్తులపై వడ్డన తప్పడం లేదని అంటోంది కేంద్రం. ఈ వాదన నిజమేనా?

చమురు రంగం నుంచి ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,56,530 కోట్లు గడించింది. ఇందులో ముడిచమురు రాయల్టీ (రూ.12,057), గ్యాస్​ రాయల్టీ (రూ.1,722 కోట్లు) ఆయిల్ డెవలప్​మెంట్ సెస్ (రూ.13,544 కోట్లు), డివిడెండ్ (రూ.29,801 కోట్లు) ఉన్నాయి. 2018-19 ఆదాయం అంచనా రూ.4,33,062 కోట్లుగా ఉంది.

చమురు ద్వారా లాభమే.. నష్టం లేదు...

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రభుత్వం ఇచ్చే మొత్తం రాయితీల్లో పెట్రోలియం రంగం వాటా 2018-19లో 8.3 శాతం (రూ.24,833 కోట్లు). 2019-20 బడ్జెట్​లో 11.1 శాతానికి (రూ.37,478 కోట్లుకు) పెరిగింది. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇదే పెద్ద మొత్తం కాదు.

ఎందుకంటే ప్రభుత్వం చమురు ద్వారా 2017-18లో రూ.4 లక్షల కోట్లకుపైగా ఆర్జించగా.. ఇదే సమయంలో రాయితీల ద్వారా (ఆహారం, ఎరువులు, పెట్రోలియం, వడ్డీ రాయితీ, ఇతరత్రా రాయితీలు అన్ని కలిపి) ఇచ్చిన మొత్తం రూ.2,24,455 కోట్లు.

petrol price
పెట్రోల్ ద్వారా ఆర్జనే అధికం

2019-20 ఆర్థిక సంవత్సరానికి రాయితీల భారం రూ.3,38,949 కోట్లుగా ఉంది. ప్రభుత్వం అన్ని రంగాల రాయితీల భారాన్ని పెట్రోలియం రంగం మాత్రమే వేస్తున్నట్లు దీనిబట్టి తెలుస్తోంది.

కేస్​-3: చమురు కంపెనీల నష్టాలు..

చమురు సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకే పెట్రో బాదుడని చెబుతూ ఉంటుంది కేంద్రం. ఈ వాదనలోనూ నిజం కనిపించడంలేదు.

అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నికర లాభం 2018-19లో రూ.69,714 కోట్లు. ఇది 2017-18లో నమోదైన రూ.69,562 కోట్లతో పోలిస్తే కాస్త ఎక్కువే. ఇందులో ఓఎన్​జీసీ అత్యధికంగా రూ.26,716 కోట్లు, ఇండియన్​ ఆయిల్ కార్పొరేషన్ రూ.16,894 కోట్లు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రూ.7,132 కోట్లు గడించాయి.

petrol price
నష్టాల నెపం సరైంది కాదు!

ఈ లెక్కల ఆధారంగా నష్టాలు వచ్చాయనే నెపంతో ధరలు పెంచడం తప్పుడు వాదన. అయిల్​ కంపెనీలకు చూపిస్తున నష్టాలు వాస్తవమైనవేం కావు.

కేస్​-4: ఎగుమతులు, దిగుమతుల లెక్కల చిక్కులు

ముడిచమురు అవసరాలకు దిగుమతులపైనే అత్యధికంగా ఆధారపడే దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. దేశంలో 2018-19 లెక్కల ప్రకారం 34.20 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి జరిగింది. వినియోగం మాత్రం 213.22 మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే దేశీయ అవసరాలకు 84 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

అయితే భారత్ దేశీయంగా అవసరమైనదానికంటే.. ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అదనపు ముడిచమురును శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇలా 2018-19లో రూ.23,07,663 కోట్ల విలువైన ఎగుమతులు చేసింది భారత్.

Petroleum products exports
విదేశాలకు పెట్రోలియం ఉప్పత్తుల ఎగుమతి

మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తుల వాటా 11.60 శాతంగా ఉంది. అంటే దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తోంది అని చెప్పడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.

ఇలాంటి విధానాలతో వినియోగదారులకు లాభం చేకూరదు. ప్రస్తుతం ఉన్న ధరల సవరణ విధానంతో.. మిగతా వస్తువుల విలువపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇది కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసే ప్రమాదం ఉంది.

కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొని.. పెట్రోల్ ధరలను నిర్ణయించే ఈ గందరగోళ విధానానికి స్వస్తి చెప్పడం మంచిది. ఇకనైనా సులభతరమైన పాలసీని తీసుకొస్తే బాగుంటుంది.

(రచయిత:డాక్టర్ పీ.ఎస్​.ఎం.రావు,ఆర్థికవేత్త)

  • గమనిక: ఈ కథనంలోని అంశాలు, సూచనలు పూర్తిగా రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.