ETV Bharat / business

భారీగా కరెన్సీ ముద్రించి ప్రజలకు పంచితే? - హైపర్ ఇన్​ఫ్లేషన్ ఎలా వస్తుంది

కరోనా వల్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కరెన్సీని అధికంగా ముద్రించి, ప్రజలకు పంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని కొంత మంది సూచిస్తున్నారు. మరి ఇది ఉపయోగకరమైన చర్యేనా? ఇలాంటి చర్యలు తీసుకున్న దేశాల పరిస్థితి ఏమైంది?

The risks of printing too much currency
కరెన్సీ ముద్రణ పెంచితే ఏమవుతుంది
author img

By

Published : Jun 8, 2021, 5:30 PM IST

Updated : Jun 8, 2021, 5:49 PM IST

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న సంక్షోభం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా కుదేలైంది. చాలా మంది నగదు లేక ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది.

ఈ సంక్షోభంతో చాలా మందికి ఒకే సందేహం.. 'డబ్బును ఎలాగు మన రిజర్వు బ్యాంకే ముద్రిస్తుంది కదా? అలాంటప్పుడు ఎక్కువ డబ్బు ప్రింట్ చేసి ప్రజలకు పంచితే ఏమవుతుంది?' అని..

నిపుణుల సలహా అదే కానీ..

డబ్బు ఎక్కువగా ముద్రించి పంచడాన్ని.. హెలికాప్టర్ మనీ అని కూడా అంటారు. ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్​, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్​ కోటక్ కూడా ఈ చర్యతోనే సంక్షోభం నుంచి గట్టెక్కగలం అని ప్రభుత్వానికి సూచించారు.

అయితే నగదును ముద్రించటం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చన్నది నిజమే అయినప్పటికీ అది కేవలం స్వల్ప కాల ఉపశమనమేనని మరికొంత మంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయం వివరంగా అర్థం కావలంటే.. మన ఆర్థిక వ్యవస్థ ఎలా పని చేస్తుందో తెలియాలి.

ఆర్థిక వ్యవస్థ సాగేదిలా..

ప్రజలు తమ వద్దనున్న డబ్బును ఖర్చు పెట్టటం లేదా పొదుపు చేయటం కానీ చేస్తుంటారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నట్లయితే పొదుపు చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే వస్తు, సేవలను వినియోగించుకునేందుకు ఖర్చు చేస్తారు.

వస్తు సేవలకు డిమాండ్ పెరిగితే.. ధరలు పెరుగుతాయి. ధరలు పెరగటం వల్ల తయారీ రంగం కూడా ఉత్పత్తిని పెంచుతుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది. ధరలు భారీగా పెరిగినప్పుడు రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుంటుంది. దీనివల్ల ధరలు నియంత్రణలో ఉంటాయి.

కరెన్సీ ప్రజలను చేరే మార్గాలు..

ఆర్​బీఐ కరెన్సీ ప్రింట్ చేసినప్పుడు ప్రభుత్వ బాండ్ల కొనుగోలు వంటి మార్గాల్లో ఆర్థిక వ్యవస్థలోకి డబ్బులు వస్తాయి. వేతనాలు, నగదు బదిలీ, రుణాలు తదితర రూపాల్లో అవి అంతిమంగా ప్రజలను చేరుతాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న కారణంగా.. ప్రజలు పొదుపు వైపు మొగ్గు చూపరు. దీనితో వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ధరలు కాస్త పెరిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది.

ఇక్కడి వరకు బాగానే ఉన్న.. దీర్ఘకాలం పాటు అధికంగా నగదు ముద్రణ కొనసాగితే ధరలు భారీగా పెరుగుతాయి. అంతేకాకుండా కరెన్సీ విలువ పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

కరెన్సీ విలువ తగ్గితే..

కరెన్సీ విలువ అనేది డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేస్తే అంతర్జాతీయంగా దాని డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల దాని విలువ కూడా పడిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టొచ్చు.

ఇలా డబ్బు ఎక్కువగా ముద్రించి సంక్షోభంలోకి జారుకున్న దేశాల్లో ముందుగా గుర్తొచ్చేవి వెనెజులా, జింబాంబ్వే.

వెనెజులా పతనానికి కారణాలు..

వెనెజులా ఆర్థిక వ్యవస్థ చమురు ఆధారంగా నడుస్తుంది. దేశ ఎగుమతుల్లో 90 శాతం వాటా చమురుదే. 2014లో క్రూడ్​ ధరలు పడిపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ కరెన్సీ 'బోలివర్'​కు డిమాండ్ తగ్గింది. దీనివల్ల 'బోలివర్' విలువ భారీగా పడిపోయింది. దీనితో దిగుమతుల విలువ పెరిగింది.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం కరెన్సీని అధికంగా ముద్రించింది. ఆ తర్వాత చమురు ధరలు మరింత పడిపోయాయి. దీనికి తోడు చమురు ఉత్పత్తి పెరిగింది. ఈ పరిస్థితులన్నింటితో 'బోలివర్' విలువ రికార్డు స్థాయిలో పతనమైంది.

ఈ సంక్షోభంలో కూడా కరెన్సీని మరింత ఎక్కువగా ముద్రించటం వల్ల సమస్య తీవ్రమైంది. దీనితో ఆ దేశంలో ధరలు ఆకాశాన్నంటాయి. దీన్నే 'హైపర్ ఇన్​ఫ్లేషన్' అంటారు. ఇలాంటి పరిస్థితులతో.. దేశ ప్రజలు తమను తాము కాపాడుకోవటానికి బోలివర్లను డాలర్లలోకి మార్చటం ప్రారంభించారు. దీనితో ఆ దేశం కరెన్సీని డాలర్లలోకి మార్చుకోవటాన్ని నిషేధించింది.

జింబాంబ్వే సంక్షోభానికి కారణాలు..

జింబాంబ్వేలో భూ సంస్కరణలతో వ్యవసాయ, తయారీ రంగాలు కుదేలై.. బ్యాంకుల రుణ వ్యవస్థ దెబ్బతింది. దీనితో ప్రభుత్వం కరెన్సీని అధికంగా ముద్రించటం ప్రారంభించింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాటలో ఉండటం వల్ల ప్రభుత్వ అప్పుల పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రుణాలు తీర్చేందుకు ఇంకా నగదును ముద్రించింది. దీనివల్ల ధరలు ఆకాశానంటాయి. ఈ సమయంలో బాండ్ల విలువ పడిపోవటం వల్ల వాటిని కూడా విక్రయించుకోలేని పరిస్థితి తలెత్తింది. ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల కొరత ఏర్పడింది. ఎక్కువ డబ్బులు తక్కువ వస్తువుల ఉండటం వల్ల ధరలు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే.. సంచులతో డబ్బులు తెస్తే.. ఒక్క బ్రెడ్​ ప్యాకెట్ మాత్రమే కొనగలిగేంత. ఈ సమయంలో ప్రభుత్వమే ధరలు నియంత్రించింది. అయితే ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువవటం వల్ల సరఫరా మందగించింది. దీని వల్ల వాస్తవ ద్రవ్యోల్బణం అదుపుతప్ప.. ఆర్థిక సంక్షోభం తలెత్తింది.

ఈ రెండు దేశాల సంక్షోభ కారణాలను విశ్లేషించాక అధికంగా డబ్బును ప్రింట్ చేస్తే స్వల్ప కాల ఉపశమనమే కానీ దీర్ఘకాల పరిష్కారం కాదు అనేది నిపుణులు వాదన. ఆర్థిక వ్యవస్థ కరెన్సీతో పాటు చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. అన్ని రకాల అంశాల్లో మంచి పురోగతి ఉన్నప్పుడు ఆరోగ్యమైన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 8, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.