ETV Bharat / business

ఈ పెట్టుబడులతో తక్కువ రిస్కు, ఉత్తమ రాబడి!

చాలా మంది అవసరాలకు మించి డబ్బు ఉన్నా.. దాన్ని పెట్టుబడిగా పెట్టడం గురించి ఆలోచించరు. ఉన్న డబ్బంతా నగదు రూపంలో భద్రపరుచుకుంటుంటారు. డబ్బు పోతుందేమో అన్న భయాలు లేదా పెట్టుబడులపై అవగాహన లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అలాంటి వారి కోసం మంచి రాబడినిచ్చే సురక్షిత పెట్టుబడి సాధనాల గురించి ఓ ప్రత్యేక కథనం.

What are the best investment tools that give good returns?
ఈ పెట్టుబడులతో తక్కువ రిస్కు, ఉత్తమ రాబడి!
author img

By

Published : Sep 20, 2020, 3:04 PM IST

Updated : Sep 20, 2020, 3:34 PM IST

డబ్బు ఉన్న వారిలో చాలా మంది దాన్ని నగదు రూపంలో దాచుకుంటుంటారు. డబ్బు విషయంలో రిస్కు తీసుకునేందుకు ఇష్టపడకకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అయితే అలా చేయడం ద్వారా ఉన్న డబ్బు మీద ఎలాంటి ఆదాయం రాకపోగా.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో దాని విలువ కూడా తగ్గుతూ వస్తుంది.

ఇలా డబ్బు విషయంలో రిస్కు తీసుకునేందుకు ఇష్టపడని వారు.. నగదుకు హామీ ఇచ్చే సురక్షిత సాధనాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. నగదు రూపంలో దాచుకుని పూర్తిగా రాబడి లేకుండా ఉండటం కంటే ఇది చాలా ఉత్తమం.

మరి అలా సురక్షిత రాబడి ఇచ్చే పెట్టుబడి సాధానాలు ఏమిటో ఓ సారి తెలుసుకుందాం.

స్వల్ప కాలిక పెట్టుబడి..

స్వల్ప కాలంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న సాధనాల్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే కావాల్సిన వెంటనే నగదు తీసుకునేందుకు వీలుంటుంది. పెట్టుబడి ఉపసంహరణ ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది. స్వల్ప కాలంలో పెట్టుబడికి సంబంధించి దేశంలో ఎక్కువగా వాడే సాధనాలను పరిశీలిద్దాం.

పొదుపు ఖాతా

పొదుపు ఖాతాకు సంబంధించినంత వరకు వార్షికంగా 3 నుంచి 4 శాతం వరకు రాబడి పొందవచ్చు. పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాన్ని అత్యవసర సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. డెబిట్, క్రెడిట్, చెక్ తదితర సదుపాయాల ద్వారా నగదును తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని కూడా అందిస్తున్నాయి.

ఫిక్సెడ్ డిపాజిట్లు

స్వల్ప కాలానికి సంబంధించి ఫిక్సెడ్ డిపాజిట్ సులభంగా చేసుకోవచ్చు. ఏడు రోజుల వ్యవధి నుంచి ఫిక్సెడ్ డిపాజిట్ చేయచ్చు. సేవింగ్ ఖాతాలో కంటే ఫిక్సెడ్ డిపాజిట్​లో ఎక్కువ వడ్డీ సంపాదించుకోవచ్చు. దీర్ఘకాలం కూడా ఈ పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడికి సంబంధించినంత వరకు ఫిక్సెడ్ డిపాజిట్లు చాలా సురక్షితమైవి. ప్రైవేటు, ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో ఈ డిపాజిట్లు తీసుకోవచ్చు.

రికరింగ్ డిపాజిట్లు

పెట్టుబడి విషయంలో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది. బ్యాంకు ద్వారా కూడా రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా రికరింగ్ డిపాజిట్​ ప్రారంభించవచ్చు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు రికరింగ్ డిపాజిట్ ఖాతాను మూసివేయవచ్చు. అందులోని మొత్తం పొదుపు ఖాతాలో జమవుతుంది.

డెట్ ఫండ్లు, ట్రెజరీ బిల్లులు..

పెట్టుబడికి డెట్ ఫండ్లు సురక్షిత ఎంపికని చెప్పవచ్చు. వీటితో వచ్చే రాబడి ఈక్విటీ కంటే తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి 18 నెలల వ్యవధితో స్వల్ప కాలంలో పెట్టుబడి పెట్టేందుకు వీటిని ఎంచుకోవచ్చు.

ఎక్కువ రాబడి ఇచ్చేందుకు ట్రెజరీ బిల్లులు చాలా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. వీటిలో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు స్వల్ప కాలానికి సంబంధించి ఉత్తమ పెట్టుబడి సాధనంగా దీనిని తీసుకోవచ్చు. వీటిలో రాబడి... బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. 91 రోజుల నుంచి 356 రోజుల వరకు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.

మనీ మార్కెట్ సాధనాలు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు

ఇవి లిక్విడ్ ఫండ్లు. వీటికి సెక్యూరిటీ ఎక్కువ. వార్షికంగా 4 నుంచి 10 శాతం రిటర్నులు ఇవి అందిస్తాయి. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ల కంటే ఎక్కువ రిటర్నులను ఇవి అందిస్తాయి.

సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లను గుర్తింపు పొందిన సంస్థలు అందిస్తాయి. వీటిలో వార్షికంగా 12 శాతం రాబడి పొందవచ్చు.

ఫిక్సెడ్ మెచ్యూరిటీ ప్లాన్లు

పన్ను ఆదా చేసుకునేందుకు ఇవి మంచి సాధనాలు. ఇవి క్లోజ్​డ్​ ఎండెడ్ ఫండ్. పెట్టుబడిదారు నిర్ణీత రాబడి కోసం వీటిని ఎంచుకోవచ్చు. పెట్టుబడి దీర్ఘకాలం ఉండాల్సిన డైనమిక్, ఎంఐపీ, గోల్ట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టకపోవటమే మేలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో రిస్కు కూడా ఎక్కువగా ఉంటుంది.

ఆర్బిట్రేజ్ ఫండ్లు

సంవత్సరం కంటే ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగించినట్లైతే పన్నుతో సర్దుబాటు చేసిన తర్వాత 8 శాతం వరకు రాబడి సాధించుకోవచ్చు. పన్ను ఆదా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు వీటిని ఎంచుకోవచ్చు. వీటిలో రిస్కు కూడా తక్కువగా ఉంటుంది. అయితే వీటిలో పెట్టుబడి ఉపసంహరణ చేసుకునేటప్పుడు విధించే ఛార్జీల గురించి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • చివరగా: రిస్కు తీసుకునే సామర్థ్యం, లిక్విడిటీ, రాబడి అంచనా వంటి అంశాలను బేరీజు వేసుకొని పెట్టుబడి పెట్టాలి.

ఇదీ చూడండి:ఒక్కో ఉద్యోగికి.. రూ.34 కోట్లు ఇచ్చాడు!

Last Updated : Sep 20, 2020, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.