ETV Bharat / business

నాలుగు నెలల్లో రెండుకోట్ల చందాదారులు హాంఫట్! - corona effect on telecom users

కరోనా సంక్షోభం, లాక్​డౌన్ ధాటికి 2020 సంవత్సరంలో నాలుగు నెలల్లో రెండు కోట్లకుపైగా మొబైల్​, ల్యాండ్​లైన్​ వాడకందారుల సంఖ్య తగ్గినట్లు ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నారు. అదే సమయంలో బ్రాడ్‌ బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య కోటి 71 లక్షలు పెరగ్గా... జూన్‌ నాటికి మొబైల్‌ నెట్​వర్క్‌, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లలో రిలియన్స్‌ జియో, ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లలో బిఎస్‌ఎన్‌ఎల్‌ అధిక వాటా కలిగి ఉన్నట్లు ట్రాయ్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

trai reported that telecom customers declained in 2020 due to corona
నాలుగు నెలల్లో 2 కోట్ల చందాదారులను కోల్పోయిన టెల్కోలు
author img

By

Published : Oct 20, 2020, 6:49 PM IST

కోవిడ్‌ ప్రభావం టెలికాం వినియోగదారులపైనా పడింది. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ వినియోగదారుల సంఖ్య రెండు కోట్లకుపైగా తగ్గినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా-ట్రాయ్‌ వెల్లడించింది. లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం, పెద్ద సంఖ్యలో కుటుంబాలు పట్టణాలు, నగరాలు వదిలి స్వగ్రామాలకు వెళ్లడం, ప్రజల ఆర్థిక స్థోమత పడిపోవడం లాంటివి టెలికాం వినియోగదారులపై చూపినట్లు ట్రాయ్ అంచనా వేస్తోంది. లాక్‌డౌన్‌ అమలు పూర్తి స్థాయిలో ఉన్న ఏప్రిల్‌ నెలలో అ ప్రభావం అత్యధికంగా ఉండగా ఆ నెలలో ఏకంగా 84లక్షలు మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ వినియోగదారుల సంఖ్య తగ్గింది.

ఫిబ్రవరి (కోట్లలో) జూన్(కోట్లలో) తగ్గుదల/ పెరుగుదల (కోట్లలో)
పట్టణ 66.1263.682.44 తగ్గుదల
నగర 51.9652.360.4 పెరుగుదల
మొత్తం కనెక్షన్లు11811620.3 తగ్గుదల
కనెక్షన్ల సాంధ్రత87.66 శాతం85.85 శాతం

పట్టణ, నగర ప్రాంతాల్లో 1.41 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 0.14 శాతం వాడకందారుల సంఖ్య తగ్గినట్లు ట్రాయ్​ తెలిపింది. ఫిబ్రవరిలో 118 కోట్లుగా ఉన్న కనెక్షన్లు... జూన్​ నాటికి 116 కోట్లకు పడిపోయి 2.03 కోట్ల కనెక్షన్లు తగ్గిపోయాయి.

బ్రాడ్​బ్యాండ్ కనెక్షన్లను పరిశీలిస్తే ఫిబ్రవరిలో 68.11 కోట్లు ఉండగా.. జూన్​ నాటికి కోటి 71 లక్షలు పెరిగి 69.82 కోట్లకు ఎగబాకింది. కొవిడ్​ ప్రభావం ఉన్నప్పటికీ విద్యాబోధన అంతా ఆన్​లైన్​ ద్వారా జరుగుతుండగా బ్రాడ్​బ్యాంక్​ కనెక్షన్లు పెరిగినట్లు ట్రాయ్​ వివరించింది.

ఫిబ్రవరి (కోట్లలో)జూన్​(కోట్లలో)తగ్గుదల/ పెరుగుదల (కోట్లలో)
మొబైల్​ కనెక్షన్లు116.05114.071.98 తగ్గుదల
వైరలెస్​ బ్రాడ్​బ్యాండ్ 5.877.51.63 పెరుగుదల

జూన్‌ చివర నాటికి టెలికం ప్రొవైడర్ల వారీగా మార్కెట్‌ వాటా

  1. రిలయన్స్‌ జియో 34.82 శాతం
  2. భారతి ఎయిర్​టెల్ 27.76 శాతం
  3. వొడాఫోన్​ ఐడియా 26.75 శాతం
  4. బీఎస్​ఎన్​ఎల్ 10.37 శాతం

ల్యాండ్​లైన్​ విభాగంలో వాటా

  1. బీఎస్ఎన్ఎల్ 41.27 శాతం
  2. భారతి ఎయిర్​టెల్​ 21.57 శాతం
  3. ఎంటీఎన్​ఎల్ 15.58 శాతం
  4. రిలయన్స్​ జియో 7.35 శాతం

బ్రాడ్​బ్యాండ్ మార్కెట్​ వాటా

  1. రిలయన్స్ జియో 57.05 శాతం
  2. భారతి ఎయిర్​టెల్​ 21.67 శాతం
  3. వొడాఫోన్​ ఐడియా 16.68 శాతం
  4. బీఎస్​ఎన్ఎల్ 3.29 శాతం

ఫిబ్రవరితో పోలిస్తే జూన్‌ నాటికి రిలయన్స్‌ జియో రెండు శాతం వాటా పెంచుకోగా...భారతి ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ ఐడియాల వాటా తగ్గగా...బీఎస్ఎన్‌ఎల్‌ వాటా చాలా స్వల్పంగా తగ్గింది.

ఇదీ చదవండిః త్వరలో వాట్సాప్​ వెబ్​లోనూ ఆ రెండు ఫీచర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.