ETV Bharat / bharat

"ఇంకా ఉద్యోగాలు లెక్కపెడుతున్నాం" - ఉద్యోగ కల్పన

ఎన్​ఎస్​ఎస్​ఓ నివేదిక సిధ్దం కాలేదన్న కేంద్ర ప్రభుత్వం

ఉద్యోగ కల్పన
author img

By

Published : Feb 1, 2019, 9:02 AM IST

ఉద్యోగ కల్పనకు సంబంధించి ఎన్​ఎస్ఎస్ఓ నివేదికనను ప్రభుత్వం దాచిపెట్టిందని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. నివేదిక ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదనే, బహిర్గతం చేయలేదని మోదీ సర్కారు స్పష్టం చేసింది.

2017-18 ఎన్​ఎస్​ఎస్​ అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్​ సహా ప్రతిపక్ష పార్టీలు భాజపా సర్కారు పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్​ఎస్​ఎస్​ఓ లెక్కల ప్రకారం 2011-12 నాటికి నిరుద్యోగ రేటు 2.2 శాతంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.

భాజపా అధికారం చేపట్టినప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఎన్​ఎస్​ఎస్​ఓ లెక్కలు చూస్తే పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై నీతి ఆయోగ్​ ఉపాధ్యక్షుడు రాజీవ్​ స్పందించారు.

ఎన్​ఎస్​ఎస్ ఓ నివేదిక పూర్తి కాలేదు, అది డ్రాఫ్ట్​ మాత్రమే . ఉద్యోగ కల్పన లేకుండా ప్రభుత్వం 7 శాతం వృద్ధి సాధించడం అసాధ్యం.- రాజీవ్​ , నీతి ఆయోగ్​ ఉపాధ్యక్షుడు

నీతి ఆయోగ్​ ప్రధాన కార్యదర్శి అమితాబ్​ కాంత్​ ఈ అంశం పై మాట్లాడుతూ...

దేశంలో ఉద్యోగ కల్పన బాగానే ఉంది, ప్రతి సంవత్సరం నీతి ఆయోగ్​ అంచనాల ప్రకారం 7 - 7.8 మిలియన్ల ఉద్యోగాల కల్పన జరుగుతోంది- అమితాబ్​ కాంత్​ నీతి ఆయోగ్​ ప్రధాన కార్యదర్శి.

ఈ ఎన్​ఎస్​ఎస్​ఓ నివేదిక 2017 జూలై నుంచి 2018 జూన్​ మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించినదిగా పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటి ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. వాస్తవానికి ఎన్​ఎస్​ఎస్​ఓ నివేదిక డిసెంబర్​ 2018 నాడే విడుదల కావాల్సింది.

undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.