కరోనా వ్యాక్సిన్ సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడంలో అన్ని దేశాలు ఉదారంగా వ్యవహరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో టీకా జాతీయవాదం ఉండకూడదని ఆమె సూచించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఈ విషయాలు పేర్కొన్నారు.
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు దేశాల మధ్య బహుపాక్షిక ఒప్పందాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు నిర్మల.
ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) వెన్నెముకలాంటివని అభివర్ణించారు విత్త మంత్రి. అందుకే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం రుణ సాయం గడువు పెంచినట్లు గుర్తు చేశారు. వివిధ రంగాలకు కూడా ఆర్థిక ప్రోత్సాహకాన్ని పెంచినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:త్వరలో దేశీయ వినియోగానికి 'ఫైజర్' టీకా?