ETV Bharat / business

ఎస్​బీఐ షాక్​- గృహ రుణాల వడ్డీ రేట్లు పెంపు - గృహ రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు

గృహ రుణాలపై వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ ఎస్​బీఐ నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది.

sbi home loan rates hike
ఎస్​బీఐ రుణాల భారం
author img

By

Published : May 8, 2020, 3:22 PM IST

రెపో ఆధారిత గృహ రుణాల రేటును 30 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది భారతీయ స్టేట్‌ బ్యాంక్ ( ఎస్​బీఐ). దీనితో పాటు ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపైనా వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. బాహ్య బెంచ్​ మార్క్ వడ్డీ రేట్లను(ఈబీఆర్​) మాత్రం 7.05 వద్ద స్థిరంగా ఉంచింది.

పెరిగిన వడ్డీ రేట్లు మే 1 నుంచే వర్తిస్తాయని తెలిపింది ఎస్​బీఐ.

పెంపునకు కారణం..

కరోనా నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచి, రియల్టీ సంస్థల నుంచి క్రెడిట్‌ రిస్క్‌ పెరిగే అవకాశం ఉందన్న మార్కెట్‌ వర్గాల విశ్లేషణల నేపథ్యంలో.. ఎస్​బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్​బీఐని ఇతర బ్యాంకులు కూడా అనుసరించే అవకాశం ఉన్నట్లు బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:ఆ సంస్థ ఉద్యోగులకు షాక్- మే నుంచి వేతనాల్లో కోత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.