ETV Bharat / business

ఆ సంస్థ ఉద్యోగులకు షాక్- మే నుంచి వేతనాల్లో కోత! - ఇండిగోపై కరోనా దెబ్బ

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇండిగో ఎయిర్​లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఉద్యోగులందరికీ మార్చి, ఏప్రిల్ నెలలకు పూర్తి వేతనాలు చెల్లించినా.. మే నుంచి జీతాల్లో కోతలు తప్పవని వెల్లడించింది. ఇది కఠిన నిర్ణయం అయినప్పటికీ.. ప్రస్తుతం తమ ముందు వేరే మార్గం లేదని స్పష్టం చేసింది.

shaking news to India employees
ఇండిగో ఉద్యోగులకు షాక్
author img

By

Published : May 8, 2020, 11:59 AM IST

బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్​లైన్స్ ఉద్యోగుల వేతనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ స్థాయి సిబ్బందికి మే నెల నుంచి వేతనాల్లో కోత విధించనున్నట్లు సంస్థ సీఈఓ రణొజోయ్‌ దత్త ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్​లో తెలిపారు. మరో దారిలేకే వేతనాల కోతకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం సూచనల మేరకు మార్చి, ఏప్రిల్ నెలలకు గానూ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించినట్లు స్పష్టం చేశారాయన.

వేతనాలు లేని సెలవులు..

వేతనాల కోతతో పాటు కొన్ని పరిమిత గ్రేడ్​ ఉద్యోగులకు నెలలో 1.5 నుంచి 5 రోజుల వరకు వేతనాలు లేని సెలవులు ఇవ్వనున్నట్లు కూడా రణొజోయ్‌ తెలిపారు. మే, జూన్​, జులై నెలలకు ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవి ఎంతో బాధాకరమైన నిర్ణయాలని రణొజోయ్‌ అభిప్రాయపడ్డారు. అయితే సంస్థలో అత్యధికంగా ఉన్న 'లెవల్ ఏ' స్థాయి సిబ్బందికి ఈ విధానం వర్తించదన్నారు.

తొలి ప్రకటన వెనక్కి..

సీనియర్ స్థాయి ఉద్యోగులకు వేతానాల్లో కోత విధించనున్నట్లు తొలుత మార్చి 19నే ఓ సారి ప్రకటన చేసింది ఇండిగో. అత్యధికంగా తన వేతనంలో 25 శాతం కోత విధించుకోనున్నట్లు రణొజోయ్‌ దత్త ప్రకటించారు. అయితే ఉద్యోగులు ఇబ్బంది పడకుండా చూడాలని కంపెనీలకు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో ఏప్రిల్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఇండిగో.

లాక్​డౌన్​తో సంక్షోభం..

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో మార్చి 25 నుంచి విమానయాన కార్యలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సంస్థలు ఉద్యోగుల తగ్గింపు, వేతనాలు లేని సెలవులు, వేతనాల్లో కోతల వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇదీ చూడండి:జియో​లోకి మరో రూ.11,367 కోట్ల పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.