ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలోకి విదేశీ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొసాగుతోంది. ఇప్పటికే ఫేస్బుక్, సిల్వర్ లేక్ వంటి సంస్థలు జియోలో భారీ పెట్టుబడులు పెట్టగా.. ఇప్పుడు వీటి సరసన అమెరికాకు చెందిన మరో సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ చేరింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్టా రూ.11,367 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు జియో వెల్లడించింది. ఈ పెట్టుబడితో 2.3 శాతం వాటను విస్టాకు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది జియో .
విస్టా పెట్టుబడితో జియో ప్లాట్‌ఫాం ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లకు, ఎంటర్ప్రైజెస్ విలువ రూ.5.16 లక్షల కోట్లకు పెరగనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది.
జియోలో ఇప్పటికే ఫేస్బుక్ రూ.43,574 కోట్లతో 9.99 శాతం వాటా, సిల్వర్ లేక్ రూ.5,655.75 కోట్లతో 1.15 శాతం వాటా కొనుగోలు చేశాయి.
ఇదీ చూడండి:ఫేస్బుక్ నుంచి త్వరలో ఉచిత ఇంటర్నెట్