ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 9.5 శాతానికి పరిమితమవ్వచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ అంచనా వేసింది. గతంలో (మార్చిలో) ఈ అంచనా 11 శాతంగా ఉండటం గమనార్హం.
కరోనా రెండో దశ సృష్టించిన సంక్షోభం, రానున్న రోజుల్లో మరిన్ని దశలు రావచ్చనే ఆందోళనలతో వృద్ధి రేటు అంచనాలను సవరించినట్లు తెలిపింది ఎస్&పీ.
కరోనా మొదటి దశ నుంచి కోలుకుని 2021-22లో భారత్ భారీ వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆశించినప్పటికీ.. దేశంలో 15 శాతం మంది ప్రజలకే కనీసం ఒక డోసు టీకా అందటం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎస్&పీ వివరించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) దేశ జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవ్వచ్చని పేర్కొంది.
ఇప్పటికే ఆర్బీఐ, ఎస్బీఐ, మూడీస్, ఇక్రా వంటి సంస్థలు కూడా.. ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే.. ఇటీవల వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోత విధించాయి.
ఇదీ చదవండి:రూ.75వేల కోట్లతో రిలయన్స్ 'హరిత వెలుగులు'!