ETV Bharat / business

రెండేళ్ల క్రితమే రూ. 2వేల నోట్ల ముద్రణ బంద్​ - రూ. 2వేల నోట్లు

రూ. 2వేల నోట్లను కొత్తగా ముద్రించి రెండేళ్లు గడుస్తోందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్​సభలో లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించారు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​.

Rs 2,000 notes not printed in last 2 years: Govt in Lok Sabha
రూ. 2వేల నోట్ల ముద్రణ రెండేళ్ల ముందే బంద్​
author img

By

Published : Mar 15, 2021, 4:50 PM IST

నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపివేసి రెండేళ్లు అయ్యింది. ఈ విషయాన్ని.. లోక్​సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వెల్లడించారు.

2018 మార్చి 30 నాటికి రూ. 2000 నోట్లు.. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 3.27శాతంగా ఉండేవని ఠాకూర్​ పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 26 నాటికి అది 2.01శాతానికి(2,499 మిలియన్​) పడిపోయిందని స్పష్టం చేశారు. 2019-20, 2020-21 కాలంలో.. రూ. 2వేల నోట్లను ముద్రించమని ప్రింటింగ్​ ప్రెస్​లకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదన్నారు ఠాకూర్​.

రూ. 2వేలకు సంబంధించి.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.99 మిలియన్​ నోట్లను ముద్రించినట్టు ఆర్​బీఐ 2019లో ప్రకటించింది. 2017-18లో 111.507 మిలియన్​ నోట్లు మాత్రమే ముద్రించారు. 2018-19 నాటికి అది 46.690 మిలియన్​కు పడిపోయింది.

ఆ తర్వాత ఒక్క కొత్త నోటు ముద్రణ కూడా జరగలేదు.

ఇదీ చూడండి:- ఆ కుటుంబాల నుంచి రూ.12వేల కోట్ల విరాళాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.