వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) మరోసారి భారీగా పెరిగింది. ఫిబ్రవరిలో సీపీఐ 5.03 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) వెల్లడించింది. 2021 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.06 శాతంగా, గత ఏడాది ఫిబ్రవరిలో 6.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం కూడా ఫిబ్రవరిలో (జనవరితో పోలిస్తే).. 1.89 శాతం నుంచి 3.87 శాతానికి పెరిగింది.
ఇంధన ద్రవ్యోల్బణం మాత్రం ఫిబ్రవరిలో 3.53 శాతానికి దిగొచ్చింది. జనవరిలో ఇది 3.87 శాతంగా ఉంది.
పారిశ్రామికోత్పత్తి నేల చూపులు
ఈ ఏడాది జనవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 1.6 శాతం క్షీణించింది. గత ఏడాది జనవరిలో ఐఐపీ 2.2 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం.. జనవరిలో తయారీ రంగంలో 2 శాతం, గనుల రంగంలో 3.7 శాతం తగ్గదల నమోదైంది.
విద్యుదుత్పాదన విభాగం మాత్రం 2021 జనవరిలో 5.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఇదీ చదవండి:మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు