రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 1.97 శాతంగా ఉంది. కాగా 2018 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.44 శాతంగా ఉంది.
ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం.
సీపీఐ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం మాత్రం ఫిబ్రవరిలో 0.66 శాతంగా నమోదు కావడం గమనార్హం. జనవరిలో ఇది 2.24 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి కీలక రేట్ల నిర్ణయంపై ప్రభావం పడనుంది.