ETV Bharat / business

ఆర్​బీఐ సమీక్ష: వడ్డీ రేట్లు యథాతథం!

రిజర్వ్​ బ్యాంకు వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చు. రిటైల్​ రంగంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఆర్​బీఐ... ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష జరపనున్న నేపథ్యంలో నిపుణులు తమ అభిప్రాయాలు తెలిపారు.

RBI likely to maintain status quo in upcoming policy review
ఆర్​బీఐ సమీక్ష- వడ్డీ రేట్లు యథాతథం!
author img

By

Published : Sep 27, 2020, 5:12 PM IST

భారతీయ రిజర్వు బ్యాంక్‌... కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ)లో ప్రస్తుతమున్న స్థితినే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు సమీక్ష జరపనుంది. అక్టోబర్‌ 1న ఎంపీసీ తన నిర్ణయాలను వెలువరించనుంది.

గతంలోనూ యథాతథం..

ఆగస్టులో జరిగిన ఎంపీసీ భేటీలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఆర్‌బీఐ ఉంచింది. ఫిబ్రవరి నుంచి దాదాపు 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపునకు గతసారి వడ్డీరేట్ల జోలికి పోలేదు ఆర్​బీఐ. ఈ సారీ అదే పద్ధతిని పాటించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే సూచనలు కనిపించే వరకు ఎలాంటి కోతా ఉండకపోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది.

4 శాతానికి పరిమితం చేయాలని..

అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతమున్న అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చని యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్‌ పేర్కొన్నారు. బహుశా ఫిబ్రవరిలో వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.69 శాతం ఉండగా.. జులైలో అది 6.73 శాతం ఉంది. దీంతో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేసేలా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి రేట్లకోత విషయంలో వేచి చూసే ధోరణికే ఆర్‌బీఐ మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఇక ఉమ్మడి పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.