ETV Bharat / business

ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్​బీఐ 2.0 మంత్రం - తాజా వార్తలు కరోనా

కరోనా ధాటికి కుదేలవుతోన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్​బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమ్ముకుంటున్న కరోనా కారు చీకట్ల నుంచి దేశానికి వెలుగు బాట చూపేందుకు రూ. 50 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.

RBI
ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్​బీఐ 2.0 మంత్రం
author img

By

Published : Apr 17, 2020, 4:38 PM IST

Updated : Apr 17, 2020, 10:28 PM IST

మొండి బకాయిల నిబంధనల సడలింపు, రుణదాతల డివిడెండ్ చెల్లింపుల నిలుపుదల, బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేలా రివర్స్​ రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది భారతీయ రిజర్వు బ్యాంకు. కరోనా ధాటికి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నింపేందుకు మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించింది.

మార్చి 25న మొదలైన దేశవ్యాప్త లాక్​డౌన్​ తర్వాత ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ రెండోసారి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రవ్యలభ్యత పెంచుతామని, బ్యాంకులకు మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

నిబంధనలు సడలింపు...

మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తుల (ఎన్​పీఏ) గుర్తింపు నిబంధనలను ఆర్​బీఐ సడలించింది. ఎవరైనా తీసుకున్న రుణం 90 రోజుల్లో తిరిగి చెల్లించకపోతే వారి ఆస్తుల్ని నిరర్థక ఆస్తులుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ప్రస్తుతం 90 రోజులుగా ఉన్న ఈ గడువును 180 రోజులకు పెంచింది ఆర్​బీఐ.

ప్రయోజనం ఏంటి?

ఈ నిర్ణయం ద్వారా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్​బీఎఫ్​సీ) రుణగ్రహీతలు లబ్ధి పొందనున్నారు. ఈ కారణంగా ఎన్​పీఏలలో పెరుగుదల ఉండదు కనుక చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కార్పొరేట్లు... బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల నుంచి మరిన్ని రుణాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.

రివర్స్​ రెపోరేటు తగ్గింపు...

నగదు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు వీలుగా రివర్స్​ రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గించింది.

ఏంటి లాభం?

తమ వద్ద ఎక్కువ మొత్తంలో నగదు ఉందనుకున్నప్పుడు వాణిజ్య బ్యాంకులు దాన్ని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇస్తుంటాయి. అలా తీసుకున్న మొత్తానికి ఆర్​బీఐ చెల్లించే వడ్డీరేటును రివర్స్ రెపో రేటు అంటారు.

ప్రస్తుతం ఈ వడ్డీని తగ్గించడం వల్ల బ్యాంకులు డబ్బును ఆర్​బీఐ వద్ద ఉంచేకంటే రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. దీని ద్వారా రుణాలు ఆశించేవారికి త్వరగా అప్పు దొరికే అవకాశం ఉంటుంది. ఇలా ఆర్థిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారముంది.

డబ్ల్యూఎంఏ పెంపు...

రాష్ట్రాలకు 60 శాతం మేర వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ) పెంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుంది.

స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్పకాలిక రుణాలను వేస్ డబ్ల్యూఎంఏగా వ్యవహరిస్తారు.

ఎల్​సీఆర్​ తగ్గింపు...

బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్​ రేషియో (ఎల్​సీఆర్​)ను 100 శాతం నుంచి 80 శాతానికి ఆర్​బీఐ తగ్గించింది. దీని వల్ల బ్యాంకుల నగదు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని తిరిగి 2020 అక్టోబర్​ 1 నాటికి 90 శాతం, 2021 ఏప్రిల్​ 1 నాటికి 100 శాతానికి పునరుద్ధరిస్తామని తెలిపింది.

జీ 20 దేశాల కంటే...

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం నెలకొందని శక్తికాంతదాస్‌ అన్నారు. 1930 తర్వాత ఇంతటి సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్‌ ఒకటని తెలిపారు. 2020లో భారత్​ వృద్ధి రేటు 1.9 శాతంగా ఉండనుందని చెప్పిన శక్తికాంతదాస్​... జీ20 దేశాల్లోకెల్లా ఇదే అత్యధికమని వెల్లడించారు.

రూ.50 వేల కోట్ల ప్యాకేజీ...

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్​టీఆర్​ఓ 2.0 ప్రకటించింది ఆర్​బీఐ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. వివిధ రంగాల రుణ అవసరాలు తీర్చేందుకు నాబార్డు, సిడ్బీ, జాతీయ హౌసింగ్​ బోర్డుకు ఈ మొత్తం అందజేయనుంది.

ఎవరికెంత?

  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు నాబార్డ్‌కు రూ.25వేల కోట్లు.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలిచ్చే వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లకు రీఫైనాన్స్‌ చేసేందుకుగాను సిడ్బీకి రూ.15వేల కోట్లు.
  • గృహరుణాలు ఇచ్చే సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు జాతీయ హౌసింగ్‌ బ్యాంక్‌కు రూ.10 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ ఇద్దరు అర్చకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్​!

Last Updated : Apr 17, 2020, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.