ETV Bharat / bharat

ఆ ఇద్దరు అర్చకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్​!

లాక్​డౌన్​తో రాష్ట్రం బయట చిక్కుకున్న కేదార్​నాథ్​, బద్రీనాథ్​ ఆలయాల ప్రధాన అర్చకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టింది ఉత్తరాఖండ్​ ప్రభుత్వం. ప్రత్యేక అనుమతులతో వారిని రోడ్డు మార్గం ద్వారా తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నెలాఖరున రెండు ఆలయాలు తెరవాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Kedarnath-Badrinath
కేదార్​నాథ్​, బద్రీనాథ్​ అర్చకుల కోసం ప్రత్యేక ఆపరేషన్​!
author img

By

Published : Apr 17, 2020, 3:52 PM IST

హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్​, కేదార్​నాథ్​ ఆలయాలను​ తెరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఉత్తరాఖండ్​ ప్రభుత్వం. అయితే.. ఇరు ఆలయాల ప్రధాన అర్చకులు లాక్​డౌన్​తో రాష్ట్రం వెలుపల చిక్కుకుపోయారు. ముందుగా వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఒకవేళ వారు అనుకున్న సమయానికి హాజరయ్యే పరిస్థితులు లేకపోతే ప్రధాన అర్చకులుగా మరొకరిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

ఈనెల 29, 30న ముహూర్తం..

గురువారం రాత్రి రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఆలయాలను తెరవటం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మతపరమైన సంప్రదాయాలు, నమ్మకాలను అనుసరించి కేదార్​నాథ్​ ఆలయాన్ని ఈనెల 29న, బద్రీనాథ్​ ఆలయాన్ని 30న తెరవాలని నిర్ణయించారు.

హోంశాఖకు లేఖ..

ప్రస్తుతం కేదార్​నాథ్ ఆలయ​ ప్రధాన అర్చకులు మహారాష్ట్రలో, బద్రీనాథ్ ఆలయ ప్రధాన​ పూజారి కేరళలో ఉన్నారు. వారిని రోడ్డు మార్గంలో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్​ కుమార్​ సింగ్​.

ఒకవేళ కేంద్రం అనుమతి ఇచ్చినా.. కరోనా నేపథ్యంలో వారు క్వారంటైన్​లో ఉండాల్సి వస్తుంది. ఆ కారణంగా వారు హాజరయ్యేందుకు అవకాశాలు కనిపించటం లేదు. అందువల్ల బద్రీనాథ్​ ఆలయాన్ని తెరిచే తేదీని పొడిగించటం, లేదా వారి స్థానంలో మరొకరిని అర్చకులుగా నియమించటం తెహ్రీ రాజకుటుంబం చేతిలో ఉంటుంది. గతంలో ఇలాంటి పరిస్థితులు 3-4 సార్లు ఎదురయ్యాయి కూడా.

ఇదీ విధంగా.. బద్రీనాథ్​, కేదార్​నాథ్​ ఆలయ కమిటీ కూడా ప్రధాన అర్చకుల స్థానంలో తాత్కాలికంగా మరొకరిని నియమించాలని కోరింది.

ఇదీ చూడండి: రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.