ETV Bharat / bharat

రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

లాక్​డౌన్ కారణంగా మందులు దొరక్క ఇబ్బంది పడుతున్న ఓ క్యాన్సర్ బాధితుడికి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు కర్ణాటకకు చెందిన ఓ కానిస్టేబుల్. ద్విచక్ర వాహనంపై 430 కిలోమీటర్లు ప్రయాణించి మందులు అందించాడు.

constable bengaluru
బెంగళూరు కానిస్టేబుల్
author img

By

Published : Apr 17, 2020, 3:07 PM IST

కరోనా వైరస్​ను నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వాలు ఎక్కకిడక్కడ లాక్​డౌన్ విధించాయి. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర ఆరోగ్య సమస్యలున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పలు ప్రాంతాల్లో మందులు దొరక్క రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

బెంగళూరులో ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్న క్యాన్సర్ రోగికి హెడ్ కానిస్టేబుల్​గా​ విధులు నిర్వర్తిస్తున్న కుమారస్వామి ఆపన్నహస్తం అందించారు. 430 కిలోమీటర్లు ప్రయాణించి మందులు తీసుకొచ్చారు.

ఇదీ సంగతి

కర్ణాటక ధార్వాడ్​లోని మణికంఠ నగర్​కు చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్​తో బాధపడుతున్నాడు. అతడు ఉపయోగించే మందులు అయిపోయాయి. సాధారణంగా బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి మందులు తీసుకొస్తుంటారు. అయితే లాక్​డౌన్ కారణంగా మెడిసిన్ డెలివరీ ఆగిపోయింది.

దీంతో హెడ్​కానిస్టేబుల్​కు బాధితుడు సమాచారం అందించాడు. తన పరిస్థితిని వివరించాడు. వెంటనే ఫోన్​ నెంబర్ సహా పలు వివరాలు తీసుకొని బెంగళూరు బయల్దేరాడు కుమారస్వామి. 430 కిలోమీటర్ల దూరంలోని ఆ ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళ్లాడు. బాధితుడికి మందులు అందించి వెంటనే విధుల్లో చేరాడు.

బాధితుడి అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ కుమారస్వామి చేసిన సహాయాన్ని పలువురు కొనియాడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కుమారస్వామికి ప్రశంసా పత్రం అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.