పార్లమెంటులో సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమయం సమీపిస్తున్న వేళ..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్థికవేత్తలు, నిపుణులతో నేడు సమావేశం కానున్నారు ప్రధాని. సాయంత్రం 4:30 గంటలకు దిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, అవసరాలపై చర్చించనున్నారు. బడ్జెట్ రూపకల్పన కోసం సలహాలు స్వీకరించనున్నారు.
వచ్చే నెల 5న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్ మొదటి సారి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు.
ఇదీ చూడండి: 'చిత్తశుద్ధి లేనందునే మల్టీ లెవల్ మోసాలు'