ఏజీఆర్ బకాయిలను టెల్కోలు చెల్లించటం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో విత్త లోటు 3.5 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏజీఆర్ రూపంలో రూ.1.20 లక్షల కోట్లు టెలికాం సంస్థలు జమ చేస్తే 3.8 శాతంగా అంచనా వేసిన ఆర్థిక లోటు కిందికి దిగుతుందని చెబుతున్నారు.
ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ టెల్కోలను ఆదేశించింది. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావడానికి చెల్లింపులకు సుప్రీం కోర్టు విధించిన తుది గడువు మార్చి 16 వరకు వేచిచూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
"2020 మార్చి 16 తర్వాత ఆర్థిక గణాంకాల్లో మార్పులు వస్తాయి. ప్రభుత్వం టెల్కోల నుంచి రూ.1.20 లక్షల కోట్లు వసూలు చేయగలిగితే 2019-20 సంవత్సరానికి గాను ఆర్థిక లోటు 3.5 శాతానికి తగ్గుతుంది. సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం.. 2019-20 సంవత్సరంలో ఆర్థిక లోటు 3.8 శాతంగా ఉంటుంది."
-ఆర్థిక వేత్తలు, ఎస్బీఐ
గ్యాస్ ధరలను తగ్గించాలి..
మరోవైపు వంటగ్యాస్‌పై ధరల పెంపుతో ప్రజలు సంప్రదాయ ఇంధన వనరులను ఆశ్రయించే ప్రమాదముందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సిలిండర్ ధరలను తగ్గించే విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా సిలిండర్‌పై రాయితీలను పెంచటం వల్ల ప్రభుత్వంపై భారం పడే అవకాశముందని స్పష్టం చేశారు.