కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు చెల్లింపుల అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంచిన మొత్తాలను చెల్లిచనున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు.. సామాజిక మాధ్యమాల్లో జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచిన మొత్తాలను చెల్లించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ ట్వీట్లో తేల్చి చెప్పింది ఆర్థిక శాఖ.
-
A document is doing rounds on social media claiming resumption of DA to Central Government employees & Dearness Relief to Central Government pensioners from July 2021.
— Ministry of Finance (@FinMinIndia) June 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
𝗧𝗵𝗶𝘀 𝗢𝗠 𝗶𝘀 #𝗙𝗔𝗞𝗘. 𝗡𝗼 𝘀𝘂𝗰𝗵 𝗢𝗠 𝗵𝗮𝘀 𝗯𝗲𝗲𝗻 𝗶𝘀𝘀𝘂𝗲𝗱 𝗯𝘆 𝐆𝐎𝐈. pic.twitter.com/HMcQVj81Sf
">A document is doing rounds on social media claiming resumption of DA to Central Government employees & Dearness Relief to Central Government pensioners from July 2021.
— Ministry of Finance (@FinMinIndia) June 26, 2021
𝗧𝗵𝗶𝘀 𝗢𝗠 𝗶𝘀 #𝗙𝗔𝗞𝗘. 𝗡𝗼 𝘀𝘂𝗰𝗵 𝗢𝗠 𝗵𝗮𝘀 𝗯𝗲𝗲𝗻 𝗶𝘀𝘀𝘂𝗲𝗱 𝗯𝘆 𝐆𝐎𝐈. pic.twitter.com/HMcQVj81SfA document is doing rounds on social media claiming resumption of DA to Central Government employees & Dearness Relief to Central Government pensioners from July 2021.
— Ministry of Finance (@FinMinIndia) June 26, 2021
𝗧𝗵𝗶𝘀 𝗢𝗠 𝗶𝘀 #𝗙𝗔𝗞𝗘. 𝗡𝗼 𝘀𝘂𝗰𝗵 𝗢𝗠 𝗵𝗮𝘀 𝗯𝗲𝗲𝗻 𝗶𝘀𝘀𝘂𝗲𝗱 𝗯𝘆 𝐆𝐎𝐈. pic.twitter.com/HMcQVj81Sf
కరోనా కారణంగా పెంపు నిలిపివేత..
కరోనా మొదటి దశ విజృంభణ కారణంగా.. 2020 ఏప్రిల్‌లో.. దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61 లక్షల పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెరిగిన మొత్తాల చెల్లింపులను నిలుపుదల చేసింది ఆర్థిక శాఖ. 2021 జూన్ 30 వరకు ఈ నిలుపుదల వర్తిస్తుందని అప్పట్లో ప్రకటించింది.
కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా 2020 జనవరి 1 నుంచే పెరిగిన (అదనపు) డీఏ, డీఆర్‌లను చెల్లించలేదని ఆర్థిక శాఖలోని వ్యయాల విభాగం పేర్కొంది. 2020 జులై 1 నుంచి 2021 జనవరి 1 వరకు కూడా అదనపు డీఏ, డీఆర్ పెంపును చెల్లించలేదని స్పష్టం చేసింది. అయితే ఆయా సమయాలకు ప్రస్తుతం ఉన్న రేట్ల వద్ద చెల్లింపులు పూర్తయినట్లు వివరించింది.
పెంపుపై 2020 మార్చిలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. 17 శాతంగా ఉన్న డీఏను 4 శాతం పెంచి 21 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. 2020 జనవరి నుంచే ఈ పెంపు వర్తింపజేయాలని భావించింది. అయితే కరోనా అనంతరం ఆ పెరిగిన చెల్లింపులను నిలుపుదల చేసింది.