2020-21 కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. వివిధ వర్గాలు, సంఘాలు, ఆర్థికవేత్తలతో రేపటి నుంచి సంప్రదింపులు జరపనున్నారు సీతారామన్. ఇందులో భాగంగా రేపు సాయంత్రం క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో చర్చించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు.
జనవరి 25లోపు సంప్రదింపుల ప్రక్రియ ముగించి బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వాలని సీతారామన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత ఫిబ్రవరి 1న శనివారం సెలవుదినమైనా.. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఇదీ చూడండి:ఫాస్టాగ్‌తో టోల్ చెల్లింపులే కాదు.. నేరగాళ్లనూ పట్టుకోవచ్చు!