ETV Bharat / business

డెడ్​లైన్​ సమీపిస్తోంది- ఆదాయపు పన్ను లెక్క చూసుకోండి! - ఐటీఆర్ కొత్త పద్దతిలో శ్లాబులు

ఆదాయపు పన్ను చెల్లించటం ప్రతి ఒక్కరి బాధ్యత. నిబంధనల ప్రకారం మినహాయింపు లేని వారంతా తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను సమర్పించేందుకు సెప్టెంబర్​ 30 చివరి తేదీ. ఈ సారి రిటర్ను దాఖలుకు రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు ఏది సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ రెండు రకాల పద్ధతుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Income Tax returns
ఇన్​కం ట్యాక్స్ రిటర్ను
author img

By

Published : Aug 6, 2021, 12:26 PM IST

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు ఉంది. ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ.. దీన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయడం మంచిది. ప్రస్తుత మదింపు సంవత్సరం (2021-22)లో పన్ను చెల్లింపుదారులు రెండు రకాల పద్ధతుల్లో ఒకటి ఎంచుకుని, రిటర్నులు సమర్పించేందుకు వీలుంది.

పాత పద్ధతిలో..

ఇప్పటివరకు మనకు అలవాటైన విధానమే ఇది. పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. సెక్షన్‌ 80సీ, 80డీ, 80ఈ ఇలా పలు సెక్షన్ల కింద మినహాయింపులు పోను పన్ను వర్తించే మొత్తానికి నిర్ణీత శ్లాబుల మేరకు పన్ను చెల్లించాలి.

పన్ను వర్తించే ఆదాయం పన్ను రేటు
రూ.2,50,000 లోపులేదు
రూ.2.5 లక్షలు-రూ.5లక్షలు5%
రూ.5 లక్షలు- రూ.10 లక్షలు 20%
రూ.10 లక్షల పైన30%

కొత్త పన్నుల విధానంలో..

వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునేందుకు వీలుంది. 2020 బడ్జెట్‌లో దీన్ని ప్రవేశ పెట్టారు. ఈ పద్ధతిలో పన్ను ఎలా ఉంటుందంటే..

పన్ను వర్తించే మొత్తంశ్లాబులు
రూ.2,50,000 లోపులేదు
రూ.2.5 లక్షలు-రూ.5 లక్షలు5%
రూ.5 లక్షలు-రూ.7.5 లక్షలు 10%
రూ.7.5 లక్షలు-రూ.10 లక్షలు 15%
రూ.10 లక్షలు- రూ.12.5 లక్షలు 20%
రూ.12.5 లక్షలు- రూ.15 లక్షలు 25%
రూ.15 లక్షలు ఆపైన30%

మనమేం చేయాలి?

ఉద్యోగులు యాజమాన్యానికి ఏ పన్ను విధానం ఎంచుకుంటున్నామో ముందుగానే చెప్పాలి. అలా చేయకపోయినా ఇప్పుడు రిటర్నులు దాఖలు చేసుకునేటప్పుడు పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను శాఖ కల్పిస్తోంది.

రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ కొత్త, పాత పన్ను విధానాల్లో దేన్ని ఎంచుకుంటారనే ప్రశ్న ఉంటుంది. సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ, ఇంటి అద్దె, గృహరుణం వడ్డీలాంటివి క్లెయిం చేసుకోవద్దు అనుకుంటే కొత్త విధానంలోకి వెళ్లాలి. లేదా అన్ని సెక్షన్ల మినహాయింపులూ క్లెయిం చేసుకుంటాను అనుకుంటే పాత విధానమే ఎంచుకోవచ్చు.

మీరు రిటర్నులు దాఖలు చేసేటప్పుడు.. ముందుగా పాత విధానంలో పన్ను గణన పూర్తి చేయండి. ఎంత మేరకు రిఫండు లేదా పన్ను చెల్లించాల్సి వస్తోందన్నది చూసుకోండి. ఆ తర్వాత కొత్త పన్ను విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోండి. దీన్ని బట్టి ఏ విధానం వల్ల కలిసొస్తుందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అనువైన పద్ధతిలో రిటర్నుల సమర్పణను పూర్తి చేయాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.