ETV Bharat / business

'అవసరమైన అన్ని చోట్ల ప్రైవేటుకు ప్రోత్సాహం' - బ్యాంకుల ప్రైవేటీకరణప మోదీ స్పందన

అవసరమైన అన్ని చోట్ల ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే తమ విధానమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సరైన ఉద్దేశంతో తీసుకున్న అన్ని వ్యాపార నిర్ణయాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Modi comment on Financial Sector
ఆర్థిక రంగంపై మోదీ వెబినార్
author img

By

Published : Feb 26, 2021, 1:47 PM IST

Updated : Feb 26, 2021, 5:41 PM IST

దశాబ్దం కిందట దూకుడుగా రుణాలు ఇవ్వటం వల్ల బ్యాంకింగ్ రంగం తీవ్రంగా కుదేలైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంపై నిర్వహించిన వెబినార్​లో ఆయన ప్రసంగించారు. పారదర్శక రహిత రుణ వితరణ నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సరైన ఉద్దేశంతో తీసుకున్న వ్యాపార నిర్ణయాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. కార్పొరేట్‌ కంపెనీల మొండి బకాయిల వసూలుకు కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో అన్ని వ్యాపారాలు లాభసాటిగా ఉండవనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుందని పేర్కొన్నారు.

అవసరమైన చోట ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని మోదీ తెలిపారు. అయితే బ్యాంకింగ్, బీమా విభాగాల్లో మాత్రం ప్రభుత్వ రంగం సమర్థంగా పని చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున వ్యాపార సంస్థలకు బ్యాంకులు.. రుణాల మంజూరును పెంచాలని మోదీ సూచించారు. అంకుర, ఐటీ, సాంకేతిక రంగాల కోసం కొత్త ఆర్థిక సేవలను సృష్టించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

జన్ ధన్​లో మహిళలే అధికం..

దేశవ్యాప్తంగా ఉన్న 41 కోట్ల జన్​ ధన్​ బ్యాంక్ ఖాతాల్లో 55 శాతం మహిళలవేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు రూ.1.5 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ బాండ్లు.. ఆకర్షణీయమేనా?

Last Updated : Feb 26, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.